నారద వర్తమాన సమాచారం / మార్చి 29/నల్గొండ జిల్లా ప్రతినిధి :శంకర్
నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడినాయి. గ్రామ యువకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ట్రాక్టర్ల యూనియన్ లో సంయుక్తంగా నిర్వహించినారు. ట్రాక్టర్ల శక్తి వేగం, డ్రైవింగ్ నైపుణ్యం ప్రదర్శించే విధంగా వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయగా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రేగోజు నరసింహ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ గౌరవ అధ్యక్షులు పసునూరి జైపాల్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోగుల వెంకటరెడ్డి తండ్రి ఇస్తాపరెడ్డి, రాగి పని ధనంజయ చారి, వీరమళ్ళ సందీప్, కెసిఆర్, సైదిరెడ్డి,ఎస్కే ఖాదర్, ఇద్రిస్, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








