Friday, May 8, 2026
spot_img

దళపతి విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన భార్య….

నారద వర్తమాన సమాచారం

దళపతి విజయ్ కు  బిగ్ షాక్ ఇచ్చిన భార్య….

రాజకీయాల్లోకి రావడం అంటే ఒక నిప్పుల గుండం మీద నడవడమే ప్రత్యర్థులు ముందు నుంచి దాడి చేస్తే ఒక్కోసారి సొంత మనుషులే వెన్నుపోటు పొడిచే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు దళపతి విజయ్ లైఫ్ లో అక్షరాల అదే జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తుంది

. ఎన్నికల యుద్ధంలో విజయ్ ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతుంటే సరిగ్గా అదే టైం చూసుకొని ఆయన భార్య సంగీత విజయ్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా ఒక భయంకరమైన స్కెచ్ వేసింది. ఏకంగా విడాకుల కేసుతో తెరపైకి వచ్చి విజయ్ను ఇరుకును పెట్టింది. ఈ వార్త అప్పట్లో కోలీవుడ్ వర్గాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హీరోయిన్ త్రిషా పేరును తెరపైకి తీసుకొచ్చి తన భర్త ఆమెతో కలిసి ఉంటున్నారని తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది సంగీత. భరణం కింద వందల కోట్లు డిమాండ్ చేసింది. తీరా ఎన్నికలు అయ్యాక ఫలితాలు వచ్చాక ఎవరు ఊహించిన విధంగా ప్లేట్ ఫిరాయించింది.

విజయ్ సీఎం అవుతున్నాడని తెలియగానే తన రూటు మార్చేసింది. ఇప్పుడు నాకు విడాకులు వద్దు భర్తే కావాలంటుంది. అసలు భర్త ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగీత ఇలా యూటర్న్ ఎందుకు తీసుకుంది ?
త్రిషకు పెట్టిన దిమ్మ తిరిగే కండిషన్ ఏంటి?
భార్య రిక్వెస్ట్ కు విజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
రాజకీయ నాయకుడికి క్లీన్ ఇమేజ్ చాలా ముఖ్యం. ఏ చిన్న పర్సనల్ మచ్చపడినా అది ఎలక్షన్ రిజల్ట్స్ మీద దారుణమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ ను టార్గెట్ చేశారు సంగీత. విజయ్ ఎలక్షన్ ఫీవర్ లో ఉన్న టైంలో విజయ్ హీరోయిన్ త్రిషతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు అనే సంచలన ఆరోపణలు చేస్తూ విడాకులకు అప్లై చేసింది. ఎన్నికల టైంలో ఇలాంటి వార్త బయటిక వస్తే విజయ్ గ్రాఫ్ పడిపోతుందని భర్తకు పొలిటికల్ గా భారీ డామేజ్ జరుగుతుందని ఆమెకు స్పష్టంగా తెలుసు. కానీ దళపతి విజయ్ ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు భయపడలేదు. ఎంతో పరిణితి గా ఆలోచించి ఇది నా పర్సనల్ విషయం. దీని గురించి ఎవరూ పట్టించుకోవద్దు. ఈ వ్యవహారాన్ని నేను కోర్టులోనే తేల్చుకుంటానంటూ చాలా తెలివిగా హుందాగా సమాధానం చెప్పి ఫ్యాన్స్ తో పాటు ప్రజల నోళ్లు మూయించాడు.
ఇక కోర్టు లోపల జరిగిన డీల్ గురించి తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. విడాకులు కావాలంటే భరణం కింద తనకు ఏకంగా 200 కోట్ల రూపాయలు కావాలని సంగీత డిమాండ్ చేసిందట. అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి విజయ్ ససేమీరా అన్నారని ఫైనల్ గా 25 కోట్ల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడానికి విజయ్ ఒప్పుకున్నాడని ఇన్సైడ్ టాక్.
ఎన్నికల టెన్షన్ నుంచి బయట పడడానికి అలాగే తన పొలిటికల్ కెరియర్ కు ఎలాంటి డామేజ్ జరగకుండా ఉండడానికి విజయ్ ఈ 25 కోట్ల డీల్ కు ఓకే చెప్పాడని సమాచారం. అంతా సెట్ అయిపోయింది ఇక విడాకులు కన్ఫర్మ్ అనుకున్న టైంలోనే అసలైన ట్విస్ట్ మొదలైంది.

అధికారానికి ఉన్న పవర్ ఎలాంటిదంటే శత్రువులను కూడా కాళ్ళ దగ్గరకు తెస్తుంది. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో విజయ్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోతున్నాడ నే విషయం కన్ఫర్మ్ అయిందో వెంటనే సంగీత తన రూటు మార్చేసింది.

ఒక సామాన్య హీరో భార్యగా ఉండడం వేరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భార్యగా ఉండడం వేరు. ఆ పవర్ ఆ స్టేటస్ ని చూసిన తర్వాత విడాకులు ఇస్తానని చెప్పిన సంగీత ఇప్పుడు నేను విడాకులు ఇవ్వను అంటూ ఒక భయంకరమైన యూటర్న్ తీసుకుంది. విడాకులు ఇవ్వనని చెప్పడమే కాకుండా సంగీత పెట్టిన మరో మైండ్ బ్లాక్ కండిషన్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాలను షేక్ చేస్తుంది. నేను నీకు విడాకులు ఇవ్వను. కావాలంటే ఆ త్రిషను రెండో పెళ్ళాం గా చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా నేను పట్టించుకోనని సంగీత పచ్చిగా తేల్చి చెప్పేసిందట.

అంటే కేవలం ముఖ్యమంత్రి భార్య హోదా వదులుకోవడం ఇష్టం లేకనే పగను కోపాన్ని పక్కన పెట్టి ఏకంగా తన భర్తను మరొకరితో పంచుకోవడానికి కూడా సంగీత సిద్ధపడిందని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వార్త వైరల్ అవుతుంది. ఈ ట్విస్ట్ దెబ్బకు అటు విజయ్ ఇటు త్రిషా ఇద్దరు షాక్ లో ఉన్నారని టాక్.

ముఖ్యమంత్రి హోదా రాగానే విడాకులు వద్దంటూ దళపతి విజయభార్య సంగీత తీసుకున్న సంచలన యూటర్న్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తమిళనాడుగా మారింది. త్రిషా విషయంలో ఆమె పెట్టిన దిమ్మ తిరిగే కండిషన్స్ నెట్ ఇంట్లో చెక్కర్లు కొడుతున్నాయి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version