నారద వర్తమాన సమాచారం
రాబోయే రోజుల్లో ఇంధనం ధరలు పెరిగే అవకాశం……..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol-Diesel prices) పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై సగటున రూ.3 పెంచుతూ శుక్రవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి రూ.3 పెంపు చాలదని..లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.10 వరకు పెరుగుతుందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులుపేర్కొన్నారు. ఈ పెంపు ఒకేసారి గానీ లేదా 2-3 వారాల్లో దశలవారీగా గానీ ఉండొచ్చన్నారు.
కేంద్రం చర్యలు
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ, ఉద్రిక్తతలు.. నిరంతర సంక్షోభాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా తమ లాభాలను వదులుకుని అధిక వ్యయాన్ని సొంతంగా భరించాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ఇంధన ధరలను రూ.3కి పెంచక తప్పలేదు. అయినప్పటికీ ఈ స్వల్ప పెరుగుదల కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప, పూర్తిగా తొలగించలేకపోయింది.
మరోవైపు దేశంలోని అతిపెద్ద పాల ఉత్పత్తుల రిటైలర్లు అయిన అమూల్, మదర్ డెయిరీ లీటరుకు రూ.2 చొప్పున పాల ధరలు పెంచడంతో వినియోగదారుల గృహ బడ్జెట్పై భారం పడింది. దీనివల్ల ప్రాంతీయ డెయిరీ సంస్థలు కూడా ధరలను విపరీతంగా పెంచే అవకాశం ఉంది. ఇంధనం, వంటగ్యాస్, పాల ధరల పెరుగుదల వల్ల రాబోయే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 0.42శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.
అలాగే 2026 వ సంవత్సరం డిసింబర్ నాటి కల్లా లీటర్ 300/-రూపాయలు అవటానికి అవకాశం కనపడుతుంది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








