నారద వర్తమాన సమాచారం
తెలంగాణ ప్రభుత్వం స్పందించి కులగణన లో విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ గా నమోదు చేయాలని ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకుడు నల్లూరి రామ్ ప్రసాదాచారి డిమాండ్ చేశారు..
తెలంగాణలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరుగనున్న బీసీ కులగణనలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలను కులంగా కాకుండా వృత్తులుగా పేర్కొనడం పట్ల తెలంగాణ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ లకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు , సీనియర్ నాయకుడు నల్లూరి రామ్ ప్రసాదాచారి అను నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఈ కులగణన పేరుతో విశ్వబ్రాహ్మణ విశ్వక ర్మలను వంచనకు గురి చేస్తున్నారని అనిపించింది. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందని అనిపిస్తుంది..
తెలంగాణ ప్రభుత్వానికి దయచేసి విన్నపం..
తెలంగాణ ప్రాంతంలో కులగణన సంధర్భంగా కులవృత్తులు పేరుతో కాకుండా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అని కమ్మరి ,వడ్ల,కంచరి,శిల్పం, స్వర్ణ కార తదితర వృత్తి దారులు అందరిని ఒకే కులస్తులుగా విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ గా పరిగణించాలని ,అదే విధంగా రికార్డు లలో లిఖితపూర్వకంగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.. నాకు వున్న సమాచారం మేరకు ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన కులగణన ఫార్మెట్లో జరిగిన పొరపాటును వెంటనే సవరించాలని విజ్ఞప్తి .
సాం ప్రదాయ వృత్తులైన కమ్మరి, వడ్రంగి, ఇత్తడి, శిల్పి, స్వర్ణకార వృ త్తులను నిర్వహిస్తున్న వారందరినీ ఒకే జాతి/కులం గా గుర్తించాలని కోరుతున్నాను.. ప్రభుత్వం మా విన్నపం ఆలోచించకుండా పొరపాట్లను సరిద్దిద్దకుండా కుల గణన జరిపితే తెలంగాణ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ జాతీయులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నాను
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









