నారద వర్తమాన సమాచారం
నూతన ఎస్పీని మర్యాద పూర్వకముగా కలిసిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు
ఇటీవల పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగదీష్ ఆదహళ్లిని బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఎస్పీ కార్యాలయం నందు పల్నాడు జిల్లా ప్రజా సంఘాల నాయకులు మర్యాదపూర్వకముగా కలిసి శాలవాలతో ఘనంగా సత్కరించి ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా జగదీష్ అదాహళ్లి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని ఆయన జిల్లాలోని శాంతిభద్రతలు ,పరిరక్షణ ప్రజలు భద్రత, బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ఈ బీసీలకు మీడియా మిత్రులపై అన్ని సామాజిక వర్గాల మహిళలకు,రక్షణ నకిలీ డాక్యుమెంటు లను సృష్టించి భూ కబ్జాలకు పాల్పడితే ప్రత్యేక చర్యలు తప్పవు జిల్లాలో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాలని, జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలను ముందుగా గుర్తించి గ్రామాలలో గొడవలు జరగకుండా ముందస్తు వికేటింగ్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడాలని,స్కూల్స్ కాలేజీల వద్ద పోలీసువారి నిఘా ఏర్పాటు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, జిల్లాలోని అన్ని గ్రామాలలో పౌరహక్కులపై, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరచాలని వారు ఎస్పీని కోరారు.
జిల్లాలోని పలు సమస్యలపై వారు ఎస్పీ వినతి పత్రాన్ని అందజేశారు.
డివిఎంసి సభ్యులు ప్రజా సంఘ నాయకులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని ఆయన క్షుణ్ణంగా చదివి సమస్యల పరిషకారానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారని వారు అన్నారు.
అలాగే జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలు పట్ల ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని ఎస్పీ వారిని అడిగి తెలుసుకున్నారు.
నూతన ఎస్సీనీ కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు, తదితర ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








