నారద వర్తమాన సమాచారం
నూతన చైర్మన్ ఎనుముల సుష్మ కేశవరెడ్డిలకు అభినందనలు తెలియజేసిన: గురజాల అప్పారావు
మున్సిపాలిటీ నూతన చైర్మన్ ఎనుముల సుష్మ కేశవరెడ్డిలకు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుకుమూడి ప్రసాద్ దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి,, శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాహక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు అభినందనలు తెలియజేశారు.
సోమవారం మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన మున్సిపల్ నూతన చైర్మన్ మరియు నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో
వారు పాల్గొని నూతన చైర్మన్ సుష్మ కేశవరెడ్డి లను కలిసి శాలవాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా సుష్మ కేశవరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయటం బాధ్యతలు చేపట్టటం సంతోషంగా ఉందని వారు అన్నారు.మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీ కారణంగా చేస్తారని, వార్డు కౌన్సిలర్లతో కలిసి వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారిపై పట్టణ ప్రజలకు విశ్వాసం ఉందని వారు తెలిపారు.
నూతన చైర్మన్
పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించి వారి మన్ననలను పొందాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








