Friday, November 22, 2024

సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన:డిప్యూటీ సీఎం భట్టి

నారద వర్తమాన సమాచారం

సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన:డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ
సింగరేణి కార్మికులకు ప్రజా భవన్ వేదికగా బోనస్ చెక్కుల పంపిణీ కార్య క్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కార్మికులు బోనస్ చెక్కులు అందుకున్నారు. ఈ ఏడాది సింగరేణికి రూ.2412 కోట్ల లాభం రాగా.. అందులో 33 శాతం అంటే రూ.796 కోట్ల ను కార్మికులకు ప్రభుత్వం బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసందే.

దాదాపు 42 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1.90 లక్షల చొప్పున బోనస్‌గా అందుకుంటు న్నారు. సింగరేణిలో పనే చేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ ఏడాది రూ. 5 వేల బోనస్ ప్రకటించారు. చెక్కుల పంపిణీ కార్యక్ర మంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. సంస్థలో ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఎంప్లాయీస్‌ మధ్య ఖర్చు విషయంలో వ్యత్యాసం చాలా ఉందని అన్నారు.

తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమదోపి డీని సహించదని అన్నారు. అందుకే ఈ వ్యత్యాసాన్ని తగ్గించడంపై తమ ప్రభు త్వం దృష్టి సారిస్తుందని అన్నారు. సింగరేణిలో మినిమం వేజెస్ పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

అవసరమైతే ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్ మధ్య ఉండే వేతనాల వ్యత్యాసాన్ని తగ్గించడానికి తమవంతుగా ప్రయత్ని స్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. సింగరేణి గనుల్లో పని చేసే కార్మికులు వైద్యం కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా చూస్తామన్నారు.

సింగరేణి భూమిని కేటాయిస్తే.. అక్కడ యంగ్ ఇండియా ఇంగిగ్రేటెడ్ స్కూల్స్‌ని పైలెట్ ప్రాజెక్ట్‌గా కింద నిర్మిస్తామని అన్నారు. పెన్షన్ విషయంలోనూ అధ్యయనం చేస్తామని.. ప్రస్తుతం రూ.8 లక్షలుగా ఉన్న పెన్షన్‌ను రూ.10 లక్షల వరకు పెంచేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading