నారద వర్తమాన సమాచార
జనాభా నియంత్రణపై ప్రజలు అవగాహన కలిగి భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వైద్యాధికారి శ్రీవాణి ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా నియంత్రణ పాటించాలని తెలిపారు. చిన్న కుటుంబాల కుటుంబాలలో ఆర్థిక పరిపుష్టక చేరుతుందని ఆమె తెలిపారు. విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా జరుగుతున్న నష్టాలపై ప్రజలకు ఆమె అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న నోముల నాగమణికి ఉత్తమ ఆరోగ్య కార్యకర్త అవార్డుని ఆమె ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోతిరెడ్డి, సూపర్వైజర్ శ్రీదేవి, ఆరోగ్య కార్యకర్తల లక్ష్మణ్ బాబు, వరలక్ష్మి, జానకి, గీతా, సునీత, ఫార్మసిస్ట్ ప్రదీప్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.