ట్విట్టర్ లో సీఎంకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు
- జగిత్యాల ఎస్ఐ పై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలని డిమాండ్..
- నారద వర్తమాన సమాచారం నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్.
ఆర్మూర్ లోని జర్నలిస్టులను బూతు మాటలు తిట్టి బెదిరించిన జగిత్యాల ఎస్సై రవీందర్ శెట్టి పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, డిజిపి రవిగుప్తకు ట్విట్టర్ ద్వారా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ లో జర్నలిస్టులుగా విధులు ముగ్గురు జర్నలిస్టులను బూతు మాటలతో దూషించి చంపుతానని బెదిరించిన జగిత్యాల ఎస్.ఐ రవీందర్ శెట్టి పై కేసు నమోదు చేయడంలో ఆర్మూర్ పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని వివరించారు. ఎస్సైని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దళిత జర్నలిస్టులను తీవ్రంగా దూషించిన ఎస్ఐ పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ట్విట్టర్ లో సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీలను కోరారు. ఆర్మూర్ జర్నలిస్టులను తీవ్ర పదజాలంతో చెప్పలేని విధంగా దూషించి బెదిరించిన రవీందర్ శెట్టిని సస్పెండ్ చేయాలని కోరుతూ హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, డిజిపీ ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.