బి .జె .పి లో చేరిన టి.ఆర్.ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నారద వర్తమాన సమాచారం, నిజామాబాద్ జిల్లా,
బాల్కొండ,11.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, టీ.ఆర్.ఎస్.వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీ కుమార్ మరియు పలువురు యువకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది. వీరికి ధర్మపురి అరవింద్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నా గారి మోహన్ ,జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ ,మండల అధ్యక్షులు కట్ట సంజీవ్, సీనియర్ నాయకులు రేంజర్ల గంగారం, చింత ప్రవీణ్ ,గంగాధర్ ,కొత్తపల్లి అరుణ్ ,భాస్కర్ ,హరీష్ ,సుభాష్ మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.