మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయం సాధిస్తాం: భారత బూషన్ బిపిఎస్ టౌన్ ప్రెసిడెంట్
నారద వార్తమాన సమాచారం: భూధాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఈరోజు ఉదయము 9 గంటలకు చౌటుప్పల్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే గారి 177 వ జయంతి కార్యక్రమం జరిగింది. పట్టణ అధ్యక్షులు భారత భూషణ్ ఆధ్వర్యంలో దీనికి ముఖ్య అతిథులుగా బిపిఎస్ రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్, నోముల గణేష్, కొయ్యడ నరసింహ, సారయ్య బాలయ్య, చింతకింది రమేష్ హాజరై జ్యోతిరావు పూలే ఆశయాలు సాధిద్దాం, సమసమాజాన్ని నిర్మించారు అని అన్నారు. జ్యోతిరావు పూలే సమాజంలోని సాంఘిక దురాచారాలను నిర్మూలించాఅని, సమాజంలోని స్త్రీలకు హక్కులు కల్పించాలని, దళిత బహుజనులకు హక్కులు కల్పించాలని పోరాటం చేశాడు. అగ్రవర్ణాల దాడుల నుండి అనగారిన వర్గాలని కాపాడిన వైతాళికుడు, స్త్రీల హక్కుల కోసం బడుగు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం ఎనలేని కృషి చేశారని, బడుగు వర్గాలకు నిన్న వర్గాలకు సమాజంలో చదువు అవసరం అని చైతన్యపరిచి అందరికీ పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రభుత్వం కూడా నిన్న వర్గాలకు దళిత బహుజన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అధిక ప్రాథమిక కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముషం మధు, చేరాల లింగయ్య, కొండమడుగు రాజు, దబ్బికారి ప్రేమ్ లాల్, డబ్బికారి హరికిషన్, చింతల ప్రకాష్, మోటాపురం రవి, పెద్దల నరసింహ, కొండమడుగు శివరాజు, బండిరాల సుశీల, నోముల గణేశ్, లాలయ్య, కొమ్ము జగన్, కుక్క దానయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.