ఈ ప్రాంత అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
అభివృద్ధితో కూడిన పేదల సంక్షేమం ఏపీకి అవసరం.
మహాకూటమితోనే ఏపీ అభివృద్ధి సాధ్యం.
-మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
మర్సుమల్లిలో రచ్చబండ ఆత్మీయ సమావేశం.
నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.
ఈ ప్రాంత అభివృద్ధిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమి విజయం సాధిస్తుందన్నారు. అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. అభివృద్ధితో కూడిన పేదల సంక్షేమం వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
మైలవరం నియోజకవర్గంలోని మర్సుమల్లి గ్రామంలోని చెరువుతో పాటు వివిధ గ్రామాల్లో చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.
అమరావతిని సర్వనాశనం చేయడం వల్ల ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఐదేళ్లలో ఒక రూపాయి కూడా ఈ పథకానికి విడుదల చేయలేదు అన్నారు. దీనివల్ల ఈ ప్రాంత రైతులు వ్యవసాయంపై ఆధారపడిన వారందరూ ఇబ్బందులు పడ్డారన్నారు. సాగునీరు సక్రమంగా లేక పంటలు సరిగా పండక వ్యవసాయ స్థిరీకరణ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ , ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.వాలంటీర్లకు రూ.10 వేలు, పింఛన్లు రూ4,000లు, దివ్యాంగులకు పెన్షన్ రూ.6000లు, రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1500లు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3000ల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం- ఒకో బిడ్డకు రూ.15000లు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏటా రూ.20 వేలు, ఉద్యోగాలు కల్పన, మెగా డీఎస్సీ తదితర పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.