ఘనంగా అంబేద్కర్ జయంతి
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు
సామాజిక న్యాయం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాంతం పోరాడారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 14,
సామాజిక న్యాయం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాంతం పోరాడారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం ను ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యాంగంగా తయారు చేయడానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు. నేటి యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, అధికారులుబి. సాయిలు, నాగరాజు, వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.