నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
సీఎం జగన్ పై హత్యాయత్నం పిరికిపందల చర్య: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం పిరికిపందల చర్య అని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. కేవలం సీఎం జగన్ కు ప్రజల్లో ఉన్న ఆప్యాయత వల్ల వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం చూసి విద్యుత్ లేని సమయంలో ప్రీ ప్లాన్డ్ గా సీఎం జగన్ పై ప్రతిపక్షాలు దాడి చేయించాయన్నారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపించకుండా డ్రామాలు అంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు. అలాంటి సానుభూతి డ్రామాలు చంద్రబాబుకు అలవాటేనన్నారు. గతంలో అలిపిరిలో కూడా దాడి చేయించుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. అయినా ప్రజలు చంద్బరాబును తిరస్కరించారన్నారు. అందుకే ఎప్పటికప్పుడు పొత్తులతో పూట గడుపుతుంటారని విమర్శించారు. సీఎం జగన్ పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.