ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, చంద్రమోహన్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 14,
రాజంపేట, కొండాపూర్ దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం, గన్ని సంచుల సరఫరా, తాగునీరు వంటి మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. దాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సిబ్బంది పొందపరచాలని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ నకలు, సెల్ ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేయాలని కోరారు. మట్టి కుండాలలో తాగునీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సివిల్ సప్లై, సహకార సంఘాల అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.