

కామారెడ్డి కోర్టులో నూతన చట్టాలపై అవగాహనా సమావేశం
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే04
కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయ భవనంలో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసెక్యూషన్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి శనివారం కామారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయంలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లకు నూతన చట్టాలపై అవగాహనా కల్పించడం జరిగింది .ఈ సమావేశంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ అశోక్ శివరాం నాయక్, అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ నిమ్మ దామోదర్ రెడ్డి,నంద రమేష్ కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు , కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ,సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ మరియు కామారెడ్డి సబ్ డివిజన్ ఎస్సై లు కోర్టు లైసనింగ్ ఆఫీసర్స్ శ్రీరాం హన్మాండ్లు, అలిమోద్దీన్ మరియు కోర్టు కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.









