దాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కిన అన్నదాత
రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన రైతులు
అధికారుల హామీ తో ధర్నా విరమణ
జగిత్యాల జిల్లా
:మే 17
ధాన్యం కొనుగోలు జాప్యం తో పాటుగా తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లుల కు తరలించకపోవడంపై కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు..
శుక్రవారం ఉదయం రాయి కల్- మైతాపూర్ రోడ్ డ్యాం సమీపంలో రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
ప్రతి సంవత్సరం సొసైటీ కొనుగోలు కేంద్రం నిర్లక్ష్యంతో రోడ్డుపైకి రావాల్సి వస్తుం దని, కేవలం ఆరుగురు హమాలి కూలీలతో ధాన్యా న్ని తూకం వేస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత ఉందంటూ మిల్లుకు తరలించకపోవ డంతో ఆరుగాలాల పాటు శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో తడిసిపో తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాగే వర్షాలు కురిసి ధా న్యం తడిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం సీఈఓను ప్రశ్నించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల జాప్యంతో ప్రయివేటు వ్యక్తు లకు ధాన్యం విక్రయించాల్సి వస్తుందని, రైతులు వాపోయారు..
అతి త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని సొసైటీ అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్న స్పందన లేకపోవడంతో ప్రతి సంవత్సరం రోడ్డు ఎక్కాల్సి వస్తుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేగంగా కొనుగోలు జరిపి ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలించే ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.
రైతుల ఆందోళన సమాచా రంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.పద్మయ్య, ఏఎస్ఐ దేవేందర్ పది రోజుల్లో కల్లాల వద్ద నుండి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సిఈఓకు సూచించి, రైతులకు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. రైతుల ధర్నా తో రోడ్డుకిరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.