వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు..
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 24,
కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్ నగర్ కాలనీ చెందిన పులారి సుజిత్ కుమార్ ఉమారాణి దంపతులు గడిచిన ఐదు సంవత్సరాలుగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ సమాజంలో రక్తదానం పట్ల ఇంకా అపోహలు తొలగిపోవడం జరగలేదని రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు రావడంలేదని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి బలహీనతలు అనారోగ్య సమస్యలు ఏర్పడడం జరగని అన్నారు.సంవత్సరానికి ఆరోగ్యవంతమైన వ్యక్తులు నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని రక్తదానం చేసిన తర్వాత 28 రోజుల లోపుగా తిరిగి మన శరీరంలో ఆ రక్తం రావడం జరుగుతుందన్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచిన సుజిత్ కుమార్ ఉమారాణి దంపతులకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేబిఎస్ రక్తనిధి ప్రతినిధులు జీవన్ వెంకటేష్ సంతోష్ పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.