సామాన్యులకు విద్యను దూరం చేసే విధంగా ప్రైవేటు పాఠశాలల తీరు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో లాభార్జనే ధ్యేయంగా ప్రైవేటు పాఠశాలల దోపిడీ..
విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన ప్రైవేటు పాఠశాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 25,
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో,పాఠ్యపుస్తకాల విక్రయాల పేరుతో అడ్మిషన్లు ఫీజు పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి యదేచ్ఛగా దోపిడీకి పాల్పడడం జరుగుతుందని ఇలాంటి పాఠశాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి లను డిమాండ్ చేశారు.నిబంధనల ప్రకారం ఏ పాఠశాల కూడా అడ్మిషన్ ఫీజులు తీసుకోరాదని జిల్లా కేంద్రంలో కొన్ని పాఠశాలలు 5000 రూపాయల అడ్మిషన్ ఫీజును నిర్ణయించడం జరిగిందని,పాఠ్య పుస్తకాలను అధిక ఫీజులతో అమ్మడం జరుగుతుందని బయట మార్కెట్లో 1000 నుండి 2000 రూపాయలకు దొరికే పుస్తకాలను 5000 నుండి 7వేల రూపాయలకు అమ్మడం జరుగుతుందని అన్నారు. నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల ఫీజును 35 వేల వరకు నిర్ణయించడం జరిగిందని అన్నారు.పాఠశాల ఉపాధ్యాయులతో ఇంటింటి ప్రచారాలను కూడా నిర్వహించడం జరుగుతుందని వెంటనే అక్రమాలకు పాల్పడుతున్న ఈ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఫీజులకు సంబంధించిన జీవోను విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాల పైన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.