Friday, November 22, 2024

ప్రముఖ సీనియర్ వైద్యులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  ఆధ్వర్యంలో..విజయవంతంగా కొనసాగుతున్న అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉచితసర్జికల్ క్యాంపు ..

.

నారద వర్తమాన సమాచారం

జూన్ :05

ప్రముఖ సీనియర్ వైద్యులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  ఆధ్వర్యంలో…

విజయంతంగా కొనసాగుతున్న
అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉచిత సర్జికల్ క్యాంపు ….

మధ్యాహ్నం వరకు 18 మందికి సర్జరీ చేసిన…వైద్యులు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ…

అచ్చంపేట నియోజకవర్గంలో ని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉచిత వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది…

ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంపు ద్వారా ఇప్పటివరకు 1230మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు వారందరికీ కూడా ఉచితంగా సర్జరీ చేయడం జరుగుతుంది…

అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో చేస్తున్న ఆపరేషన్ లో ఏమైనా పెద్ద సర్జరీలు ఉంటే హైదరాబాదులోని గాంధీ ఉస్మానియా హాస్పిటల్ కూడా పంపించి సర్జరీ చేపించడం జరుగుతుంది…

అచ్చంపేట నియోజకవర్గం లోని ప్రజలు ఏ ఒక్కరు కూడా వైద్యపరంగా ఇబ్బంది పడకుండా ఉచితంగా అన్ని రకాల ఆపరేషన్లు కూడా ఇకనుండి మూడు నెలలకు ఒకసారి ఉచిత సర్జికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు ద్వారా పెద్ద ఆపరేషన్లు చిన్న ఆపరేషన్లు అన్ని రకాల శాస్త్ర చికిత్సలు చేస్తాము…

రోజుల్లో అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ను అన్ని రకాల విభాగాలు, వైద్య సిబ్బంది పారామెడికల్ స్టాఫ్ ను మరియు వైద్య పరికరాలను
మంజూరు కొరకై…

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ  దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా త్వరలో అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు…

అచ్చంపేట ఏరియా హాస్పిటల్ వైద్యులు పారామెడికల్ సిబ్బంది అందరు సహకారంతో ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతుంది…

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరీడెంట్ డాక్టర్ ప్రభు పాల్గొన్నారు…


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version