Wednesday, February 5, 2025

పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించండి.!

నారద వర్తమాన సమాచారం

చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని?.

ఆ వ్యక్తి ఇలా అన్నాడు….
జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌ దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను.

‘మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి’ అని అతను అడగడం జరిగింది . ‘మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు…. మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు ? అతను కొంచం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, ‘ నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బే మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు’!
విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి #యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు …”నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి” అని వెయిటర్ అనగా….అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ ని అభినందిస్తూ ఇలా అనడం జరిగింది …. “ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం”. అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు

హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి ,సత్కరించిన హటల్ యజమానికి, వెయిటర్ కి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి ,కూతురు.

సమయం గడిచిపోయింది (కొన్ని సంవత్సరాల పిమ్మట)…
ఒక రోజు ఆ అమ్మాయే ఐ ఏ ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి.

అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థం గా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా .., వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది- “మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను ,మాతండ్రితో కలసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మెుదటి ర్యాంకు తెచ్చికొన్న విషయం మీకు తెలిసి.. మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడ అడగక పోవడమే కాక మమల్ని మీరు ఘనంగా సత్కరిృచడం జరిగింది . ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి, మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు.

ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరుపున, ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను. అలా అని అందరి ముందు హోటల్ యజమనితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది.

పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించండి…. వాళ్ళను ప్రోత్సహించండి తిండి లేని పేద విద్యార్థులు ఆదుకుందాం వారిని వారికి ఏదో రూపంలో అందరం సహాయ పడదాం ఆదుకుందాం

💐🙏💐


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version