నారద వర్తమాన సమాచారం
వివాదాస్పదం లో ట్రైనీ ఐఏఎస్ అధికారి ఖేద్కర్
ఉత్తరప్రదేశ్
ఖేద్కర్‌పై ఆరోపణల నేప థ్యంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు ట్రెయినీ ఐ ఎ ఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది.
ఆమె అధికార దుర్విని యోగానికి పాల్పడటం తోపాటు, యు పి ఎస్ సి కి తప్పు డు అఫిడవిట్ సమర్పిం చారన్న ఆరో పణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ దర్యాప్తు చేపట్టారు.
రెండు వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు. పుణెలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్‌కు బదిలీ చేశారు.
తన ప్రైవేటు కారుకు సైర న్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వినియోగించడంతో మొద లైన వివాదం… తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెం ట్‌లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి.
చివరికి ఆమె యు పి ఎస్ సి అభ్య ర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదిక ఆధారంగా ఖేద్కర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.