నారద వర్తమాన సమాచారం
కుమ్మర బంధు పథకం ప్రవేశపెట్టి కుమ్మరుల జీవితాలలో వెలుగులు నింపాలి : ప్రముఖ అర్ టి ఐ కార్యకర్త, రాపోలు లింగస్వామి కుమ్మర
కుమ్మర వృత్తిని ప్రోత్సహించాలి
రోజు రోజుకి అంతరించి పోతున్న కులవృత్తి
సమాజంలో కుమ్మరులకు గుర్తింపేది —
50సంవత్సరాలు దాటినా వృత్తి దారులకు 5000పెన్షన్ ఇవ్వాలి
ఎల్బీ నగర్
కుమ్మర బంధు పథకం ప్రవేశపెట్టి కుమ్మరుల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రముఖ అర్ టి ఐ కార్యకర్త, సామాజిక సేవకులు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి కుమ్మర ప్రభుత్వానికి సూచించారు. ఎల్బీ నగర్ లో విలేకరుల సమావేశంలో రాపోలు లింగస్వామి కుమ్మర మాట్లాడుతూ తరాలు మారినా కానీ కుమ్మరుల జీవితాలు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి పరంగా గాని, రాజకీయ పరంగా గాని ఆర్ధిక పరంగా గాని రోజు రోజుకు కుమ్మరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రపంచానికి నాగరికత నేర్పిన కుమ్మరన్న నేడు కుల వృత్తిని నమ్ముకుని జీవించే పరిస్తితిలేదన్నారు. 50 సంవత్సరాలు దాటిన కుల వృత్తి దారులకు నెలకు 5000రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి, ఏ ప్రభుత్వం కూడా ఈ సమాజంలో కుమ్మర కులం కూడా ఉందని గుర్తించలేకపోవడం చాలా బాధాకరమన్నారు.కుల వృత్తిపై ఉన్న మమకారంతో ఇటు వృత్తి పని చేయలేక, అనేక ఆర్ధిక ఇబ్బందులతో ఇతర ప్రాంతాలకు బతుకు జీవుడా అంటూ వలసలు వెళ్లి జీవనాన్ని వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి నేటికీ 76సంవత్సరాలు అవుతున్నా కానీ చట్ట సభలలో కనీసం అడుగుపెట్టలేకపోవడం తమ గళాన్ని వినిపించే నాయకులు లేకపోవడంతో ప్రభుత్వాలు కుమ్మరులను చిన్న చూపు చూస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుమ్మరులంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా కుమ్మరులను గుర్తించి ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ లు ఇచ్చి వడ్డీ లేని ఉచిత సబ్సిడీ రుణాలు అందించి అంతరించి పోతున్న వృత్తిని కాపాడాలని కోరారు. పది లక్షాలతో కుమ్మర బంధు ను అందించి కుమ్మరులు ఆర్ధికంగా బలపడేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అదే విధంగా పెరిగిన నూతన టెక్నాలజీకి అనుగుణంగా కుమ్మర వృత్తి సామాగ్రిని ఉచితంగా అందించి వృత్తి దారులను మరింత ప్రోత్సహించాలన్నారు. కుమ్మరులు ఆర్ధికంగా, రాజకీయంగా గాని, వృత్తి పరంగా గాని ఎదిగేందుకు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనైనా కుమ్మరులను గుర్తించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.