నారద వర్తమాన సమాచారం
సమాచార హక్కు చట్టం (2005)రాష్ట్ర కమిషనర్లను తక్షణమే నియామించాలి :ఆర్ టి ఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాపోలు లింగస్వామి శాలివాహన
చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆర్ టి ఐ రక్షక్ ఎనలేని కృషి
ఎల్ బీ నగర్
సమాచార హక్కు చట్టం (2005) రాష్ట్ర కమిషనర్లను తక్షణమే నియమించాలని ఆర్ టి ఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాపోలు లింగస్వామి శాలివాహన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాపోలు లింగస్వామి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంl 2005) చట్టం వచ్చి 18 సంవత్సరాలు అవుతున్న గాని సామాన్య ప్రజలకు రోజు రోజుకి అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమవడంతో నేటి వరకు కూడా సామాన్య ప్రజలకు ఈ చట్టం పైన అవగాహన లేకుండా పోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మా ఆర్ టి రక్షక్ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సూచిక బోర్డులను పరిశీలించి బోర్డులు లేనియెడల నూతన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా కానీ సూచిక బోర్డులను సైతం ఏర్పాటు చేయడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దింతో సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులు తమకు కావలసిన సమాచారాన్ని ఏ కార్యాలయంలో ఈ అధికారిని కలిసి దరఖాస్తు చేసుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్ టి ఐ రక్షక్ సమాచార హక్కు చట్టాన్ని గ్రామ స్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు.దరఖాస్తుదారులు కోరినటువంటి సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ఇవ్వడంలో కూడా అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.చట్టాన్ని దీంతో చట్టం నీరు కారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర కమిషనర్ లేకపోవడంతో దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనైనా సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్ర కమిషనర్ను తక్షణమే నియమించి చట్టాన్ని ప్రతిష్టంగా అమలయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.