నారద వర్తమాన సమాచారం
నార్కట్ పల్లి స్టూడెంట్ వేల్పెర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:ప్రముఖ ఎన్ ఆర్ ఐ సల్గుటి నరేష్ రెడ్డి ప్రసంశ
ఎల్లప్పుడు తాము అండగా ఉంటాం
ఎల్ బీ నగర్
స్టూడెంట్ వేల్పర్ అసోషియోషన్ కు ఎల్లప్పుడు తాము అండగా ఉంటామని ప్రముఖ ఎన్ ఆర్ ఐ హైదారాబాద్ వాసి సల్గుటి నరేష్ రెడ్డి పేర్కొన్నారు. నర్కట్ పల్లి స్టూడెంట్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యలో శుక్రవారం సైదాబాద్ లో సమావేశాన్ని నిర్వహించారు.సంస్థ ఏర్పాటు కు గల కారణాలు,సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది,పూర్వ విద్యార్థులందరిీనీ ఏ విధంగా ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు .వారికి సంస్థ ఏ విధంగా ఉపయోగపడుతుంది.తదితర అంశాలపై ప్రముఖ ఎన్ ఆర్ ఐ నరేష్ రెడ్డి తో సుదీర్ఘంగా చర్చించారు. తక్షణమే స్పందించిన నరేష్ రెడ్డి స్వాన్ చేసే సేవల్లో తాము కూడా భాగస్వాములమవుతామని 10000వేల రూపాయలు అందించడం జరిగింది.పసునూరి రవీందర్ రెడ్డి 5000,వంగల శ్రీధర్,1500,ఆర్, బాలు 2000, ఏ,అనీష్ రెడ్డి 2000 రూపాయల ను అందించడం జరిగింది .ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐ నరేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ స్టూడెంట్ వెల్పెర్ అసోసియేషన్ పేరుతో నార్కట్ పల్లి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ ఆపదలో నేనున్నానంటూ కొండంత భరోసా కల్పిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.నాకు తెలిసి ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఆ విద్యార్థులందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో సొసైటిని ఏర్పాటు చేసి దాదాపు 1000 మందికి పైగా సభ్యులను చేర్చి ఎవ్వరికైనా సరే విద్య,వైద్యం,ఆర్థిక పరంగా గాని ఎలాంటి ఆపద ఉన్నా కానీ సంస్థ వారందరికీ అండగా ఉండేందుకు నిరంతరం సేవే లక్ష్యంగా పని చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు మామిళ్ళ సత్తిరెడ్డిని అభినందించారు.రాబోయే కాలంలో స్వాన్ కు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని ఎన్ ఆర్ ఐ గా తమ వంతు సహకారం అందిస్తామని భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. వ్యవస్థాపక అధ్యక్షుడు మామిల్ల సతిరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండి కూడా తాను కష్టం విలువ తెలిసిన వ్యక్తిని సమాజ సేవ చేయాలనే సంకల్పం ,అందరూ బాగుండాలి అందులో నేనుండాలనే ఉద్దేశంతో స్టూడెంట్ వేల్పేర్ అసోషియోషన్ అనే ఎన్ జీవో సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనీ ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులకు తమ సేవలను అందించి అనతికాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు రావడం జరిగిందన్నారు .సభ్యులందరి సహకారం,దాతల సహకారం ఉన్నట్లయితే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులందరితో కలిసి తమ సేవలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాన్ సభ్యులు మెరుగు శ్రావణ్ కుమార్,నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







