నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
ఈ ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చెసినట్లు, అగ్రికల్చరల్ అసిస్టెంట్ లోన్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు, మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి.
చిలకలూరిపేట పట్టణంలో నివాసం ఉండే గుడిస, పుల్లయ్య సన్ /ఆఫ్ కోటయ్య అను అతను దుబాయ్ లో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తనతో పాటు పనిచేసే గుర్రం జ్ఞానేశ్ సన్ /ఆఫ్ సుందర రావు 2022 సంవత్సరంలో ఇంటికి సంబంధించి ప్లాట్ ఇప్పిస్తానని ప్లాట్ కొరకు కిస్తీల చొప్పున మొత్తంగా 8 లక్షలు తీసుకున్నట్లు ఇప్పటికి ఫ్లాట్ ఇప్పించకుండ, ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వకుండా డబ్బులు అడిగినప్పుడల్లా అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అని ఇబ్బంది పెడుతున్నట్లు తన డబ్బులు తనకు ఇప్పించవలసిందిగా కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు.
కారంపూడి మండలం, కారంపూడి గ్రామం, ఇందిరానగర్ కు చెందిన సురుగుల మంగమ్మ వైఫ్ /ఆఫ్ చిన్న అమరయ్య, 53సం, అను ఆమె కుమారుడి వద్ద సుమారు నాలుగు సంవత్సరాల క్రితం కె.రత్నాకర్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని 5 లక్షలు డబ్బులు తీసుకొని ఇప్పటికి ఉద్యోగం ఇప్పించనందున మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కువ చేస్తే మిమ్మల్ని చంపేస్తా అనే బెదిరించిన రత్నాకర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు.
పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ కు చెందిన జల్ది నయోమి డాటర్ /ఆఫ్ పఠాన్ మొహిద్దిన్ అను ఆమె టైలరింగ్ పని చేసుకుని జీవిస్తున్నట్లు గోపిశెట్టి విజయమ్మ అను ఆమె ఫిర్యాది దగ్గర డ్రెస్సులు కుట్టించుకుంటూ మంచితనం మీద 2 లక్షల చీటి పాట వేసినట్లు, ఆ పాటను పాడుకొని ఐదు చీటీలు కట్టిన తర్వాత, గత 5 చీటీల నుంచి కట్టకుండా ఉన్నట్లు కట్టమని ఇంటికి వెళ్లి అడిగితే సదరు పేరయ్య, విజయమ్మ వాళ్ళ కూతురు, కుమారుడు తిట్టి కొట్టినట్లు కులం పేరుతో దూషించినట్లు ఈ విషయమై సదరు పై వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు.
నరసరావుపేట మండలం, గోనెపూడి గ్రామానికి చెందిన సుంకర రామయ్య సన్ /ఆఫ్ సీతారామయ్య, 44సం అను అతనికి మరియు వారి గ్రామంలో ఉండే చాలా మంది రైతుల దగ్గర నుంచి గోనెపూడి గ్రామానికి అగ్రికల్ అసిస్టెంట్ వచ్చిన నరసరావుపేటకు చెందిన పగడాల అనిల్ అనే వ్యక్తి అగ్రికల్చర్ లోన్లు సబ్సిడిలో వ్యవసాయ పనిముట్లు ఇప్పిస్తానని చెప్పి గోనెపుడి గ్రామానికి చెందిన రైతులను, ఫిర్యాదిని మోసం చేసి సుమారు 67 లక్షలు తీసుకున్నట్లు సదరు అనిల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇచ్చిన ఫిర్యాదు.
నరసరావుపేట పట్టణం బరంపేటకు చెందిన తిలగం శెట్టి గౌరీ అలియాస్ మేదరపాలెం గౌసియా వైఫ్ /ఆఫ్ తెలగం శెట్టి పవన్ కుమార్, 32 సంవత్సరాలు అను ఆమెకు సుమారు 13 సంవత్సరాల క్రితం నరసరావుపేట పట్టణానికి చెందిన పవన్ కుమార్ తో ప్రేమ వివాహం జరిగినట్లు వీరికి ముగ్గురు పిల్లలు సంతాన కలిగినట్లు గత కొద్దిరోజులుగా తన భర్త తన అత్తమామలు ఆడపడుచు మాటలు విని మానసికంగా శారీరకంగా విడాకులు ఇవ్వమని హింసిస్తున్నట్లు ది.5 5.2024న తన భర్త బాగా తాగి వచ్చి తనను కొట్టి చంపేస్తాను బెదిరించి ఇంట్లోంచి వెళ్లినట్లు తనకు తన ముగ్గురు పిల్లలకు తన భర్త అత్తమామ, ఆడపడుచుల నుంచి ప్రాణహాని వున్నట్లు వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు.
ఎడ్లపాడు మండలానికి చెందిన ఎడ్లూరి వెంకటరావు సన్ /ఆఫ్ వీరయ్య అను అతను కూలి పనులు చేసుకుని ఒంటరిగా జీవిస్తున్నట్టు ఇతనికి గల ఒకే ఒక కొడుకు నాగరాజు ఇతని ఆస్తి కాజేసి ఇతనినీ ఇంట్లోంచి తరిమేసి ఎక్కువ మాట్లాడితే చంపుతా అని బెదిరిస్తున్నట్లు వృద్ధుడు అయిన నాకు న్యాయం చేయాల్సిందిగా తన కొడుకు పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సింది కోరుచు ఇచ్చిన ఫిర్యాదు.
నరసరావుపేట పట్టణం నిమ్మ తోటకు చెందిన పాశం వనిత వైఫ్ /ఆఫ్ సురేష్ అను ఆమెకు మిర్యాలగూడ చెందిన
సురేష్ తో 2019 సంవత్సరంలో వివాహం అయినట్లు వీరు మనస్పర్థలు కారణంగా విడిపోదల్చి పెద్దల
సమక్షంలో రాజీ పడి విడాకులు తీసుకొనుటకు సిద్ధమై జీవన భృతి కింద 7లక్షలు ఫిర్యాదికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి
ఉన్నట్లు కోర్టులో మ్యూచువల్ డ్రైవర్స్ చేసుకున్నట్లు ఇప్పుడు ఆ డబ్బులు రావాలంటే విడాకుల సమయంలో నా
భర్త తరపు పెద్ద మనిషిగా వ్యవహరించిన బత్తుల వెంకటేశ్వరరావుకు రెండు లక్షల ఇవ్వాలని లేకుంటే సంతకం
పెట్టను, డబ్బులు ఇవ్వనని నా భర్త మరియు మరదలుకు బత్తుల వెంకటేశ్వరరావు బెదిరించుచున్నారని సదరు.
వెంకటేశ్వరరావు పై తన భర్త పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు.
ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘం వారి
సహకారం తో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం చేసి ఎస్పీ స్వయంగా భోజనం వడ్డించడం జరిగినది.
ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్
సిబ్బంది సహాయసహకారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో అదనపు ఎస్పి (క్రైమ్) లీగల్ అడ్వైజర్, ఆరైలు, ఎస్ బి సీఐలు, ఎస్సైలు
మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.