ఆగస్టు 5 నుంచి 9 వరకు రాష్ట్రంలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ పారిశుధ్యం,గ్రీనరీని పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో, ప్రతి పట్టణ వార్డులో స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమ నిర్వహణకు గ్రామ స్థాయిలో, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించాలని,గ్రామ స్థాయి బృందంలో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి ఆశా వర్కర్, గ్రామ సంఘంలోని 3 ఆఫీస్ బియరర్స్, ఇతర గ్రామస్థాయి సిబ్బంది , వార్డ్ బృందంలో స్థానిక కౌన్సిలర్/కార్పొరేటర్, వార్డు అధికారి ప్రత్యేక అధికారి, రిసోర్స్ పర్సన్స్ అధ్యక్షులు ఉంటారని సీఎస్ తెలిపారు.
సమావేశ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందేలా తీర్చిదిద్దేందుకు
ప్రజలను, ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలలో చనిపోయిన మొక్కలను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్రతి రోజు ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛమైన త్రాగునీటిని అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. స్వచ్ఛతనం – పచ్చదనం కార్యక్రమం చేపట్టేందుకు
గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులను భాగస్వాములు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.