ప్రమోషన్ పొందిన ఫిజికల్ డైరెక్టర్లు తరలి రావాలి
పేట టీఎస్ కామారెడ్డి
(వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా శాఖ)
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా
నేడు ఎల్బీ స్టేడియం హైదరాబాదు నందు జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి బయలుదేరడానికి వ్యాయామ ఉపాధ్యాయులు కామారెడ్డి లోని కర్షక్ బీఈడీ కాలేజీకి ఉదయం 8 గంటలకు తరలి రావా లని జిల్లా అధ్యక్షులు రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల మధుసూదన్ రెడ్డి అన్నారు. గత 15 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పండిత్ మరియు పీఈటీల అబ్రిడేషన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చొరవతో సుప్రీంకోర్టులో ఉన్న అబ్రిడేషన్ కేసును రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోరాడి కేసును డిస్పోస్ చేయించి రాష్ట్రంలో 8630 పండిత పోస్టులను 1849 పీఈటీ పోస్టులను మొత్తం కలిపి 10479 పోస్టులను ఉన్న తీకరణ చేసి మరియు ప్రమోషన్ల ద్వారా మొత్తం కలిపి 24,584 పోస్టులను ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది, కామారెడ్డి జిల్లాలో 1051 పోస్టులను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరంలో ఉన్న సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయ లోకానికి ఎంతో మేలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలపడానికి కామారెడ్డి జిల్లాలో ప్రమోషన్ పొందినటువంటి 78 ఫిజికల్ డైరెక్టర్లు తరలిరావాలని అదేవిధంగా ప్రతి ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్లను నియమించాలని, ప్రైమరీ పాఠశాలలో పి ఈ టి లను నియమించాలని, అదేవిధంగా బి.పి.ఈ డి చేయడానికి సమ్మర్లో ఇన్సర్వీసు లొ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నీ కోరుతున్నాము అని జిల్లా అధ్యక్షులు రంగా వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.