కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చెయ్యాలి
.ఆగస్టు 01 నుండి 8 వరకు ఆందోళనలు..
బి.దేవారం సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి
నారద వర్తమాన సమాచారం ,
ఆర్మూర్
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆగస్టు ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కుమార్ నారాయణ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని వారు అన్నారు.
మరో వైపు విఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డులను కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తుందని వారు అన్నారు.
అదేవిధంగా బీడీలు చేస్తున్న బీడీ కార్మికులకు వారితో పాటు చాటాలు గంప ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ₹4,16 రూపాయలను జీవన మృతి కింద ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయకుండా కాలం గడుపుతుందని వారు అన్నారు.
అట్లాగే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నేడు కొంతవరకు మాఫీ చేస్తూ మేము చేశామని పొగడ్తలు చేసుకుంటున్నారని వారు అన్నారు.
నేతికి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఎంతోమంది రోడ్లమీద జీవనం గడుపుతున్నారని వారికి సకాలంలో ఇల్లు నిర్మాణం జరగలేదని వారు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇండ్ల నిర్మాణాల కోసం 10 లక్షల రూపాయలను వెంటనే అమలు చేయాలని వారు అన్నారు మరోవైపు విద్యార్థులు వారికి వచ్చే ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలు నేటికీ ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న కూడా వాటికి మాత్రం విడుదల చేయకపోవడం సరైనది కాదని వారు అన్నారు.
బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు చివర ఇబ్బందులకు గురై వారి చదువులు మధ్యలోనే ఆగిపోతుందని వారు అన్నారు తక్షణమే ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రతి సంవత్సరం విడుదల చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు అన్నారు.
రేషన్ కార్డు లేని కుటుంబాలు చాలా ఉన్నాయని రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులను ఇవ్వాలని అర్హులైన ప్రతి ఒక్కరికి జీవన భృతి ఇవ్వాలని రైతులకు రుణమాఫీ ఎటువంటి షరతులు పెట్టకుండా రెండు లక్షలు ఏకకాలంలో మాఫీ చేయాలని నిరుద్యోగంపై శ్వేత పత్రం ప్రకటించి జాబ్ కాలండర్ ని విడుదల చేయాలని పోడు సాగుదారులందరికీ పట్టాలను వారికి హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఆగస్టు 01 నుండి 08 తేదీ వరకు వివిధ మండలాలలో వివిధ రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఆగస్టు 08న జరిగే చలో కలెక్టరేట్ ని విజయవంతం చేయాలని వారు అన్నారు.
ఇకరైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయకులు ఎం.ముత్తెన్న సబ్ డివిజన్ నాయకులు గంగన్న, శేఖర్, ఠాకూర్, రాజన్న ,నరేంధర్, పద్మ, అనిల్ ,గంగాధర్, సునీత, లక్ష్మీ , నజీర్, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.