నారద వర్తమాన సమాచారం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తీసుకున్న నిర్ణయంతో గోల్డ్ అప్రైజర్ల కుటుంబాలు వీధిన పడనున్నాయి
వివరాలు ఇలా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా గోల్డ్ అప్రైజర్లుగా పనిచేస్తున్న కొందరు స్వర్ణకారులను అకస్మాత్తుగా తీసివేయుటకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కార్పొరేట్ సంస్థ అయిన POBO’s గోల్డ్, వారి గోల్డ్ అప్రైజర్లను వినియోగించుటకు ఒప్పందం కుదుర్చుకుంది. కావున గత పది 20 సంవత్సరాల నుండి ఇంకా ఎక్కువ సంవత్సరాల నుండి పనిచేస్తున్న అప్రైజర్లు వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అసలే కార్పొరేట్ జ్యువెలరీ షాపుల దాటికి చతికిలబడ్డ స్వర్ణకారులు వారి కుటుంబాలు ఈ అప్రైజర్ వృత్తి వల్ల పొట్ట బట్టకు బతుకుతున్నారు. కాగా ఇలాంటి కంపెనీలు వచ్చి వారి జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి.ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి వచ్చేది కమిషన్ మాత్రమే అది కూడా కస్టమర్ దగ్గర నుండి వసూలు చేసి ఇస్తారు అయినా ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసంగా పనిచేస్తున్న వారిని అకస్మాత్తుగా తీసివేయ్యడం అన్నయ్యయం.ఇటీవలే విజయనగరం జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అప్రైజర్ గా పని చేస్తున్న కడియం లక్ష్మణ్ రావు విధుల నుండి తొలగించడం వల్ల దిగులుతో ఆకస్మిక మరణం పొందారు. కావున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం త్వరగా స్పందించి ఇలాంటి సంఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలో తరించిన వారి అప్రైజర్లను ఆదుకునే విధంగా మంచి నిర్ణయం తీసుకోగలరని, ఇంత వరకు పనిచేస్తున్న అప్ప్రైజర్లను వారి విధులను అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.