ఘనంగా ఫ్రెండ్షిప్ డే
ఫ్రెండ్షిప్ డే నిర్వహిస్తున్న రోజు ధర్మ యోగ అండ్ హెల్త్ అసోసియేషన్ సభ్యులు
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో ఆదివారం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ లో
బోధిధర్మ యోగా అండ్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సీత భాస్కర్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా ప్రారంభించారు. యోగ సభ్యులంతా ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ డే బాండ్లను పట్టుకుని తమ స్నేహితులు స్నేహ భావాన్ని చాటారు. ఈ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నిస్వార్ధంగా ఉండేది ఒక స్నేహం మాత్రమే మనకు ఎలాంటి బంధం లేకున్నా ఫ్రెండ్షిప్ ఒక బంధం ఉండి జీవితాంతం మనతో ఉండేది ఒకటేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ శిక్షకురాలు కొయ్యడ సంధ్యా కాశీనాథ్, సంస్థ ఉపాధ్యక్షులు చింతల రామకృష్ణ, విడం రామనాథం, ప్రధాన కార్యదర్శి చింతకిందికిరణ్, సహాయ కార్యదర్శి కేమ విష్ణుమూర్తి, కోశాధికారి కొండమడుగు మల్లేష్, సహాయ కోశాధికారి కడివేరు శేఖర్, కార్యనిర్వాక కార్యదర్శి చిలువేరు బాలరాజ్, సహాయ ప్రచార కార్యదర్శి కొయ్యడా లింగస్వామి, గౌరవ సలహాదారులు వనం వెంకటేష్, సభ్యులు వీడం విష్ణు, సిరిమల్లె పరమేష్, రాజశేఖర్, జగదీష్ , బాలరాజు, ముసునూరు యాదగిరి, మునిరాజు, బామండ్ల రాజు, చేరాల లింగస్వామి, బాలాజీ, భాను, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.