నారద వర్తమాన సమాచారం
యువత స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని అందుకోవాలి
ఐ ఓ సీ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వక్తల పిలుపు
విజయవాడ,
ఆగస్టు
నగరంలోని బందరు రోడ్డులో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి, పైలెట్ సర్వీస్ స్టేషన్ పెట్రోలు బంకులో స్వాతంత్ర్య సమరయోధుల భవన నిర్వాహకులు సర్వోదయ ట్రస్ట్ కార్యదర్శి, సీనియర్ సిటీజన్స్ యన్.టి.ఆర్. జిల్లా, అధ్యక్షులు మోతుకూరి.వెంకటేశ్వరరావు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్య్రానంతర పరిణామాలను వివరించారు.
అనంతరం ఎక్స్ సర్వీస్మెన్ రాష్ట్ర అధ్యక్షులు సి.బి.జి.బాబు బాపూజీ విగ్రహాన్ని పుష్పమాలతో ఆలకరించి నేటి ఈ కార్యక్రమానికి రావటం, ఈ చిత్ర పదర్శన ఎంతో ఆనందాన్ని కలిగించినదన్నారు. సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ ఆగష్టు- 1947 నాటి ఛాయ చిత్ర ప్రదర్శన ఎంతో అద్భుతముగా ఉన్నదని నేటి యువత మరీ ముఖ్యముగా నగరములోని విద్యార్థిని, విద్యార్థులు తప్పక చూసి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అందుకోవాలన్నారు. సీనియర్ సిటీజన్స్ యన్.టి.ఆర్. జిల్లా, కార్యదర్శి వేమూరి బాబురావు ప్రసంగిస్తూ బ్రిటీష్ కాలం నాటి లేఖలు వారి ఫోటోలను సంతకాలతో కూడిన పెద్ద పెద్ద బోర్డులను అమర్చటం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమములో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డివిజనల్ రిటైల్ హెడ్ అనిల్ కుమార్ యన్.టి.ఆర్.జిల్లా, సేల్స్ అధికారి కొమ్మెజు వరప్రసాద్ పాల్గొని అతిధులకు, విశిష్ట అతిధులకు మెమెంటోలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా యం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి చొరవ, సహాయ సహకారాలు అభినందనీయమన్నారు. పైలెట్ సర్వీస్ స్టేషన్
మేనేజర్ కె. వెంకటప్పయ్య ఆహుతులందరికి అల్పాహారం, తేనీరును ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సందర్భములోను తాము వినయోగదారులతో ఎల్లప్పుడు పంచుకుంటూనే ఉన్నామని అందుకు ప్రతి వినయోదారుని సహాకారాన్ని ఎన్నడూ మరువలేమని అన్నారు. మునుముందు తాము చేపట్టే మంచి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని వెంకటప్పయ్య తన పత్రికా ప్రకటనలో కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.