నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు IPS, అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్(అడ్మిన్)
ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 73 ఫిర్యాదులు అందాయి.
నరసరావుపేట పనస తోటకు చెందిన షేక్ మస్తాన్ వలి (అడ్వకేట్) ది.14.07.2024వ తేదీన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ RRR వారి MD అయిన రాయల రాజారావు నరసరావుపేట శుభం ఫంక్షన్ హాలు నందు మీటింగ్ పెట్టి ఎవరైతే 1,00,000/- లు కడితే రోజుకు 900 రూపాయల చొప్పున 200 రోజులు ఇస్తామని చెప్పగా ఫిర్యాది 1,10,000/- లు ఇచ్చినట్లు కానీ వారు షేక్ మస్తాన్ వలి కు ఏమి ఇవ్వకుండా మోసం చేసినట్లు దానికి గాను మస్తాన్ వలి తో పాటు మరి కొంతమంది కలసి రిపోర్టు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట మండలం అల్లూరి వారి పాలెం గ్రామానికి చెందిన సూపురి విష్ణుమూర్తి 2020 టు లో కాకాని పరిధి (JNTU) వద్దగల సువర్ణభూమి వెంచర్ లో 200 చదరపు గజాల స్థలమును మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన కోడావత్. లక్ష్మణ్ నాయక్ ఇప్పించగా సదరు సూపురి విష్ణుమూర్తి డబ్బులు మొత్తం చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు దానికిగాను చర్య తీసుకుని తీసుకుని వలసిందిగా రిపోర్టు ఇవ్వడం జరిగింది.
రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన పరుచూరి ఆంజనేయులు తన కొడుకు పై చదువుల నిమిత్తం యూరప్ దేశాని కి పంపించాలని 10,00,000/- వరకు లలిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హోటల్ మేనేజ్మెంట్
అబ్రాడ్ బిజినెస్ కన్సల్టెన్సీ తరఫున మేనేజర్ అయిన కత్తి సునీత అను ఆమెకు కట్టి సుమారు రెండు సంవత్సరాలు అయినను యూరప్ పంపనందున డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై
చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా రిపోర్టు ఇవ్వడం జరిగింది.
ఈపూరు మండలం బొగ్గారం గ్రామానికి చెందిన రాఘవమ్మ కు(72 సం)
మందపాటి అరుణ మరియు ముండ్రు సీతమ్మ ఇద్దరు సంతానం అయినట్లు,
వారికి ఆస్తిని సమ భాగాలలో పంపిణీ చేసి రెండు ఎకరాల పొలం ను తన జీవనాధారం కోసం ఉంచుకోగా దానిని రాఘవ పెద్ద కూతురు అయిన సీతమ్మ కౌలుకు చేసుకుంటూ ఫిర్యాదు ని మోసం చేసి సంతకాలు పెట్టించుకుని వారి మనవడి పేర్లు ముండ్రు రవీంద్ర పవన్, ముండ్రు అజయ్ కుమార్ పేర్ల మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించినట్లు కావున ప్రభు న్యాయం చేయవలసిందిగా రిపోర్టు ఇవ్వడం జరిగింది.
అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన శాఖమూరి శ్రీనివాస్ కు సంబంధించిన ఆస్తులను నకిలీ అగ్రిమెంట్స్, పాత స్టాంపుల తో పసుపులేటి జనార్ధన రావు, జూపల్లి ఆదయ్య నాగబాబు అనువారు నకిలీ అగ్రిమెంట్ ను వ్రాయించి నట్లు, ఒరిజినల్ అగ్రిమెంట్స్ ను పరిశీలించి పై వారిపై ఫోర్జరీ చేసినందు వల్ల తగు చర్య తీసుకుని వలసిందిగా రిపోర్టు ఇవ్వడం జరిగింది.
తుల్లిబిల్లి సుబ్బారావు వడితే బాలు నాయక్ అనే వ్యక్తి వద్ద తప్పుగా ఎనిమిది లక్షలు తీసుకొని అప్పుకు హామీగా సుబ్బారావు పొలంలో విక్రయ దస్తావేజు చేయించినట్లు గాను, ఈ క్రమంలో సుబ్బారావు డబ్బులు చెల్లిస్తానని వడితే బాలు నాయక్ కు చెప్పగా భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్టు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేటకు చెందిన పసుపులేటి ఆంజనేయులు కు రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామంలో 8ఎకరాల పొలం ఉండి అందులో సుబాబుల్ పంట వేయగా 2022వ సంవత్సరంలో భైరిశెట్టి ముక్కస్వామి అను అతను పంటను కోసుకొని అమ్ముకున్నట్లు, మరల ఐదు నెలల క్రితం ఫిర్యాదు పొలంలోని మట్టిని అక్రమంగా తవ్వుకొని 4000 ట్రక్కులు మట్టి అమ్ముకున్నట్లు అడిగితే అడ్డు వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని తనకు తగు న్యాయం చేయవలసిందిగా రిపోర్టు ఇవ్వడం జరిగింది.
సత్తెనపల్లి నివాసి అయిన ఉర్లగొండ సాంబశివరావు కు 2019 నుండి దండమూడి పూర్ణ చంద్రరావుతో పరిచయం ఉండగా ఆ పరిచయంతో పూర్ణచంద్రరావు సుమారు మూడు సంవత్సరాల క్రితం ఫిర్యాదికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని పలు దఫాలుగా 60 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసినట్లు రిపోర్టు ఇవ్వడం జరిగింది.
శావల్యాపురం మండలం మత్తుమల్లి గ్రామానికి చెందిన ఉప్పలపాటి అన్నపూర్ణ మరియు మరి కొంతమంది కలిసి ఉపాధి హామీ పనులు చేసినట్లు పనికి సంబంధించిన డబ్బులను సర్పంచ్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ ఇద్దరు కలిసి డ్రా చేసుకొని మోసం చేశారని రిపోర్టు ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు దాతలు అన్నదానం ఏర్పాటు చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.