నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్‌లో 168 ఎకరాల రేస్ క్లబ్ స్థలంపై రేవంత్ రెడ్డి కన్ను..
దానికి బదులుగా ఫోర్త్ సిటీలో రేస్ క్లబ్ కోసం భూమిని కేటాయింపు..
రేస్ క్లబ్ భూమిని అభివృద్ధికి ఇవ్వడం ద్వారా వచ్చే నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలనే యోచనలో ప్రభుత్వం?
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో 168 ఎకరాల రేస్ క్లబ్ భూమిని ప్రభుత్వం తీసుకుని దానికి బదులుగా రేస్ క్లబ్‌కి ఫోర్త్ సిటీలో ఒకటిన్నర రెట్ల భూమిని ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
దీనిపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
త్వరలోనే తుది నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
దీంతోపాటు అంబర్‌పేటలో శిథిలావస్థలో ఉన్న సిటీ పోలీసు లైన్(సీపీఎల్) క్వార్టర్ల భూమిని సైతం తీసుకొని.. ఈ రెండింటినీ అభివృద్ధికి ఇవ్వడం ద్వారా వచ్చే నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.