నారద వర్తమాన సమాచారం
అమరావతి పనుల పునఃప్రారంభం కూటమి చిత్తశుద్ధికి నిదర్శనం: ప్రత్తిపాటి
కమ్మవారిపాలెం, కనపర్రులో అభివృద్ధి పనులకు ప్రత్తిపాటి శంకుస్థాపన
సంక్షేమం – అభివృద్ధి మేళవింపుగా ప్రజాపాలన అందిస్తామన్న కూటమి నినాదానికి నిదర్శనమే రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతోనే 5 సంతకాలతో సంక్షేమశకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 నెలల స్వల్ప వ్యవధి లనే ఇక్కడ అమరావతి, అక్కడ పోలవరం పనులు ఏకకాలంలో తిరిగి పట్టాలెక్కించడానికి చేస్తు న్న కృషిని ప్రతిఒక్కరు హర్షిస్తున్నారని అన్నారు. అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్ధండ రాయునిపాలెం వద్ద అమరావతి నిర్మాణ పనులు పునప్రారంభిన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా శనివారం చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం, నాదెండ్ల మండలం కనపర్రులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. కమ్మవారిపాలెంలో రూ.7.5 లక్షలతో రహదారి, కనపర్రులో రూ.20 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. గత ఐదేళ్లు అభివృద్ధి కనిపించలేదన్నారు. అమరావతి పనులు తిరిగి ప్రారంభించిన సందర్భంగానే మరో రెండు వారాల్లో పోలవరాన్ని తిరిగి పట్టాలెక్కి స్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన రాష్ట్రం మొత్తానికి శుభవార్తగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం, ఆర్థికప్రగతికి ఊతంగా అమరావతి పూర్తి చేసిన ముఖ్యమంత్రిగా చంద్ర బాబు, కూటమి ప్రభుత్వం పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.