నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 72 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నాదెండ్ల మండలం నాదెండ్ల కు చెందిన పరకాల వెంకటేశ్వరరావు హీరా నందిని గుంటూరు బ్రాంచ్ నందు తన ఇంటిని తాకట్టు పెట్టి తొమ్మిది లక్షల తీసుకున్నట్లు, గత మూడు నెలల నుండి తన భార్య ఆరోగ్యం బాగా లేక మూడు నెలల నుండి ఈఎంఐ కట్టడం లేదని, ఫైనాన్స్ వారు మీ ఊరికి వచ్చి పంచాయతీ పెడతాము, ఇంటి మీద బోర్డులు పెడతాము అని దుర్భాషలాడుచున్నట్లు దాని పై చర్య తీసుకొన వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నూజెండ్ల మండలం పాత నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన నాదెండ్ల బాల కోటయ్య 2022వ సంవత్సరంలో ముప్పాళ్ళ చంద్రబాబు, ముప్పాళ్ళ పవిత్ర మరియు ఇంకా ముగ్గురితో కలిసి ఒక సొసైటీ ని ఏర్పాటు చేసి వినుకొండ పట్టణంలో పాఠశాల స్థాపించినట్లు అయితే ముద్దాయిలు ఫిర్యాదుకు తెలియకుండా సుమారు 17,00,000/- రూపాయల వరకు మోసం చేసినట్లు ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
రెంటచింతల మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ ది పేరేచర్ల లో SSC ఎగ్జామ్(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) దానికి వెళ్ళిన సమయంలో లోకేష్ రెడ్డి అను అతను ఎస్సై అని పరిచయం అయి ఫిర్యాదికి ఎస్ఐ గానీ డిజిపి ఆఫీస్ లో గాని ఉద్యోగం ఇప్పిస్తానని విడతల వారీగా 25 లక్షల రూపాయల డబ్బులు నేరుగా మరియు ఫోన్ పే ద్వారా తీసుకుని వచ్చిన మార్కు లిస్టులో ఫిర్యాదు పేరు, హాల్ టికెట్ నెంబర్ మరియు తప్పుడు మార్కు లిస్టు సృష్టించి తప్పుగా అపాయింట్ మెంట్ ఆర్డర్ సృష్టించి మోసం చేసినాడని, తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసినందుకు గట్టిగా అడగగా తన మొబైల్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు కావున ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
సత్తెనపల్లి పట్టణానికి చెందిన నల్ల సాయి కళ్యాణి మరియు యాడికి చెన్నమరాజు భారతి అను వారిరువురూ ది.02.06.2024 తేదీన శేషము పార్వతి మరియు మీరావళి అను వారి వద్ద 4,00,000/- లు తీసుకొనగా వారు ఫిర్యాదు వద్ద నుండి ఖాళీ ప్రామిసరీ నోట్ లు తీసుకున్నట్లు, అనంతరం దఫాలుగా వడ్డీతో కలిపి ఐదు లక్షల 43 వేల రూపాయలు ఇచ్చినను ఇంకా డబ్బులు కట్టాలని బెదిరిస్తున్నందుకుగాను గాను న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
మాచవరం గ్రామానికి చెందిన మొక్కపాటి రామయ్య యొక్క పందెపు ఎద్దు విలువ 3,00,000/- లు కలిగినది ఉండగా సదరపు పందెపు ఎద్దు 15.10.2024వ తేదీ నుండి కనిపించనట్లు ఫిర్యాదు వెతకగా అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు గ్రామంలో బండి మేకల వీరన్న దగ్గర ఉండగా ఫిర్యాదు తన ఎద్దును ఇవ్వమని అడగగా తిట్టి నేను ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకోవని చంపుతాను అని బెదిరించగా సదరు విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావు పేట బరంపేట కు చెందిన మండలపు వెంకట రామిరెడ్డి కు నందు కిషోర్ అను వ్యక్తి RTO ఆఫీసు నందు ఉద్యోగం ఇప్పిస్తానని విడతల వారీగా 1,50,000/- లు తీసుకొని ఫైర్యాడికి ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఎస్పీ ని కలిసి న్యాయం చేయవలసింది గా అర్జీ ఇవ్వడమైనది.
నరసరావు పేట అరండల్ పేటకు చెందిన శివరాత్రి లక్ష్మి దుర్గ కు 13సం క్రితం వివాహం అయి ముగ్గురు సంతానం అయినట్లు గాను సదరు ఈ క్రమంలో ఫిర్యాదు భర్త శ్రీనివాసు వివాహమైనప్పటి నుండి అనుమానిస్తూ,పిల్లలు తనకు పుట్టలేదని ఫిర్యాదు ను మరియు పిల్లలను పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నట్లు కావున ఫైర్యాదికి తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు భోజన ఏర్పాట్లను చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.