నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట.
ఈరోజు కారంపూడి మండలం కాచవరం గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దాని గురించి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ
ఈరోజు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో కారంపొడి మండలం కాచవరం గ్రామానికి చెందిన చిలకల వెంగళరెడ్డి అను వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టడం వలన ఆ వేధింపులు భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్త అవాస్తవం అని తెలిపిన పలనాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.
వెంగల్ రెడ్డి బంధువులు పురుగుమందు త్రాగి చనిపోయినట్లుగా చెబుతున్నారు దీనికి గల కారణం పోస్టుమార్టం తరువాత తెలియవలసి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ది.02.11.2024 వ తేదీ సాయంత్రం గ్యార్మి పండుగను పురస్కరించుకొని జండా ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా మృతుని ఇంటి వద్దకు వెళ్లగా మా ఇంటి ముందుకు ఎందుకు వస్తున్నారని చెప్పి మృతుడు గొడవ పడడం జరిగింది. దానికి సంబంధించి సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి నిన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎంక్వయిరీ లో భాగంగా అతనిని స్టేషన్ కు తీసుకు రావడం గాని, వేధించడం గానీ జరుగ లేదు.
కాబట్టి ఇలాంటి అవాస్తవాలను ఎవరైనా ప్రచురించిన, సోషల్ మీడియా నందు పోస్ట్ చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.