నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ను చూడవలసిన బాధ్యత పిల్లలదే
ది.18.11.2024వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇచ్చిన ఫిర్యాదు కు సంబంధించి స్వయంగా వెళ్లి విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
ది 18.11.2024 వ తేదీ సోమవారం
రోజు
ప్రజా సమస్యల
పరిష్కార వేదిక నందు ఎడ్లపాడు గ్రామానికిచెందినఎడ్లూరివెంకట్రావుఅనువ్యక్తి పల్నాడు జిల్లా
ఎస్పీకి
తన
ఒక్కగానొక్క కుమారుడు అయిన నాగరాజు ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని గొడవ పడుతూ తన ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ కంచిశ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా వెళ్లి విచారించగా తండ్రి కొడుకుల మధ్య సుమారు పది సంవత్సరాల నుండి గొడవలు జరుగుతూ 2022 వ సంవత్సరంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ కింద ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ నందు వెంకట్రావు కొడుకు అయిన నాగరాజు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయినను నాగరాజు అతని పద్ధతి మార్చుకొనుక పోగా ఈరోజు ఎస్పీ స్వయంగా వెళ్లి తండ్రి కొడుకులతో మాట్లాడి సయోధ్య కుదర్చడం జరిగింది.
దానికి గాను యడ్లురి వెంకట్రావు కుమారుడు అయిన నాగరాజు తన తండ్రిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానని తనే భోజనం పెడతానని ఎస్పీ కి పెద్దల సమక్షంలో చెప్పడం జరిగింది. ఒక సామాన్యమైన వ్యక్తి తనకు కలిగిన ఇబ్బందిని జిల్లా పోలీసు అధికారికి తెలియపరచగా స్వయంగా వచ్చి విచారించి కొన్ని సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యను పరిష్కరించినందుకు ఎడ్లపాడు గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు మరియు గ్రామ పెద్దలు ఆనందం వ్యక్తం చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.