నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ …
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు డ్రగ్స్,మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించినారు
ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధులలో పోలీసు అధికారులు ఈ క్రింది విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
డిజిటల్ ప్రపంచంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి, సైబర్ నేరాలకు బలి కావొద్దు.
సమాజాన్ని సురక్షితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి బాధ్యత – సైబర్ నేరాలను అరికట్టండి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.
సైబర్ నేరాలు అజ్ఞానం వల్ల కాదు, అవగాహన లోపం వల్ల జరుగుతాయి.
సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం అనేది మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకు కీలకం. ప్రతి ఒక్కరూ అవగాహనతో, జాగ్రత్తతో ఉండాలి.
ఎవరికి ఊరికే ఏమీ రాదు అని గ్రహిస్తే చాలు సైబర్ నేరాలను నియంత్రించవచ్చు.
సైబర్ క్రైమ్ ను చేదించే కంటే నివారణ ఉత్తమ మార్గం.
అవగాహన సదస్సు ద్వారా మీరు అవగాహన పెంచుకొని మీ తోటి వారిని చైతన్యపరిచి సైబర్ క్రైమ్ ని అరికట్టాలియువతబాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుంది.. ఫలితంగా సమాజం బాగుంటుంది. సంకల్పాలను క్రమశిక్షణతో సాధించి, రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
యువతబాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుంది.. ఫలితంగా సమాజం బాగుంటుంది. సంకల్పాలను క్రమశిక్షణతో సాధించి, రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
ఇటీవల కాలంలో మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్, కంప్యూటర్ ఒక భాగం అయిపోయాయి. ఇవి లేకుండా మనకు ఒక రోజు గడవటం కష్టంగా ఉంది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను సులభంగా బురిడీ కొట్టించి ఆర్థికంగా దోచుకుంటూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మనీ ట్రాప్, హనీ ట్రాప్ వంటి సైబర్ నేరానికి ఎవరూ అతీతులు కాదని చదువుకున్న యువతీ యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వయోవృద్ధులు ఎక్కువగా ఈ వలలో పడి మోసపోతున్నారని, వారు ఏ విధంగా బయటపడాలో తెలియక ఆర్థికంగా నష్టపోయి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య వరకు వెళుతుండడం చాలా బాధాకరమన్నారు.
ఇటీవల కాలంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు యూనివర్సిటీలు కాలేజీలలో విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయని వాటికి సంబంధించిన ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 లేదా పల్నాడు జిల్లా ఎస్పీ గారికి సమాచారం ఇస్తే డ్రగ్స్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
మానవత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై కొంతమంది విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. వాటికి మూలమే మద్యం, మత్తు పదార్థాలు అని మీరందరూ వాటికి దూరంగా సురక్షితంగా ఉంటూ సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం క్షేత్ర స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు వీటి పైన అవగాహన కల్పించి సమాజంలో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా భావి పౌరులుగా తీర్చి దిద్దలనే ముఖ్య ఉద్దేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రతిష్ఠాత్మకంగా కాలేజీలు మరియు పాఠశాల ల నందు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







