పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
పిడుగురాళ్ల:-
నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద అతి వేగంతో చెట్టును ఢీకొన్న కారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు
గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ తరలింపు
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తున్న కారు
కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు
ది.08.12.24 వ తేది తెల్లవారు జామున సుమారు 6గం.ల సమయంలో హైదరాబాద్ నుండీ పిడుగురాళ్ళ వైపు వస్తున్న ఎర్టిగా కార్ , డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు వైపు వున్న సైన్ బోర్డ్ మరియు చెట్టును డీకొనగా కార్లో ప్రయాణిస్తున్న ఆంజనేయ స్వామీ మాల ధరించిన ముగ్గురు మగవాళ్లు ,ఒక ఆడ మనిషి స్పాట్ లో చనిపోయారు నలుగురికీ గాయాలుఅవ్వగా హాస్పిటల్ కు పంపడమైనది. వీరంతా శుక్రవారం రోజున కావలి నుండి బయలుదేరి తెలంగాణ కొండగట్టు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో బ్రహ్మణపల్లి వద్ద చెట్టును డీ కొట్టి ప్రమాదం జరిగింది.
మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వఆసుపత్రి కి తరలింపు
మరణించిన వారు
- తుళ్లూరి సురేష్, S/o వెంకటేశ్వర్లు, 35 సంవత్సరాలు, సి/గౌడ, సిరిపురం (V), కావలి (M), నెల్లూరు (D).
- తుళ్లూరి వనిత, W/o సురేష్ 32 సంవత్సరాలు, సి/గౌడ, సిరిపురం (V), కావలి (M), నెల్లూరు (D).
- ఉప్పల యోబ్లు, S/o రామయ్య, 60 సంవత్సరాలు, C/గౌడ్, సిరిపురం (V), కావలి (M), నెల్లూరు (D).
- వెంకటేశ్వర్లు, సి/గౌడ, సిరిపురం (వి), కావలి (ఎం), నెల్లూరు (డి). గాయపడిన వారు
- ముప్పాల ఆదిలక్ష్మి, w/o రామచంద్రయ్య, 40 సంవత్సరాలు, సి/గౌడ, సిరిపురం (V), కావలి (M), నెల్లూరు (D).
- ముప్పాల శ్రీను, S/o వెంకయ్య, 35 సంవత్సరాలు, సి/గౌడ, సిరిపురం (V), కావలి (M), నెల్లూరు (D).
- ముప్పాల ప్రణయ్ కుమార్, S/o రామచంద్రయ్య, 23 సంవత్సరాలు, సి/గౌడ, సిరిపురం (V), కావలి (M), నెల్లూరు (D). కారు యజమాని & డ్రైవర్
- కౌసల్య, సి/గౌడ, సిరిపురం (వి), కావలి (ఎం), నెల్లూరు (డి). పిడుగురాళ్ల పోలీసు వారు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.