నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ నరసరావుపేట
ట్రాన్స్ఫార్మర్ లలో కాపర్ వైర్ దొంగలించిన దొంగల అరెస్ట్.
ముద్దాయిల వద్ద నుండి సుమారు 3,50,000/- రూ విలువ గల కాపర్ వైర్ రికవరీ.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు I.P.S., ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ K. నాగేశ్వర రావు ఆద్వర్యంలో వినుకొండ రూరల్ సి.ఐ B. ప్రభాకర్ , ఐనవోలు పోలీస్ స్టేషన్ యస్.ఐ. B.V. కృష్ణా రావు వారి సిబ్బంది సహాయముతో పల్నాడు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్నారనే పిర్యదుల పై
Cr. No: 61/2024. 72/2024, 89/2024 & 116/2024 303 (2) BNS (379 IPC) of Inavolu P.S (4 కేసులు) నమోదు చెయ్యడం జరిగింది.
సుమారు ఒక సంవత్సర కాలం నుండి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ లను పగులగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ ను దొంగలించి దానిని తక్కువ రేటుకు ఇనుప కొట్లకు అమ్ముకుంటున్నట్లు, ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిది లోనే కాకుండా పల్నాడు జిల్లాలోని శావల్యాపురం, బండ్లమోటు, వినుకొండ, నకరికల్లు, మాచర్ల టౌన్, రొంపిచర్ల లో మరియు ప్రకాశం జిల్లా లోని దొనకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పెద్దారవీడు, దర్శి పోలీస్ స్టేషన్ ల పరిది లోని పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ లను పగులకొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ దొంగలించినారు.
ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి కాపర్ వైర్ దొంగిలించిన
సంఘటనలకు
సంబందించి పల్నాడు జిల్లాలో 19 కేసులు, ప్రకాశం జిల్లాలో 8 కేసులు. మొత్తం 27 కేసులు నమోదై ఉన్నాయి.
ఈ కేసులు అన్నింటిలో
ముద్దాయిలు
అయిన:
- నల్లబోతుల పెద్ద యంగయ్య s/o రాజయ్య A/63 సం,,లు, C/బోయ, అసనపాలెం గ్రామం, దోర్నాల మండలం, ప్రకాశం జిల్లా.
- బత్తుల కోటయ్య, S/o వెంకటేశ్వర్లు, A/32 సం,,లు, C/యాదవ, పెద్దవరం గ్రామము నూజెండ్ల మండలం, పల్నాడు జిల్లా.
- వీరబోయిన బాలయ్య S/O రామయ్య, గాంధీనగర్ గ్రామము, వినుకొండ మండలం,పల్నాడు జిల్లా.
- తోలుసురి లక్ష్మి నారాయణ 5/o వెంకటేశ్వర్లు, తురిమెల్ల గ్రామము
అను వారిని అరెస్టు చేసి
వారి వద్ద నుంచి మొత్తం 350 కేజీల దొంగిలించిన కాపర్ వైర్ స్వాదీన పరుచుకోవడమైంది.
మొత్తం కాపర్ వైర్ విలువ సుమారు Rs.3,50,000/- రూపాయలు.
ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేసిన వినుకొండ రూరల్ సీఐ ని, ఐనవోలు ఎస్సై ని మరి పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.