నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
ఈనెల 31వ తేదీన.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ పర్యవేక్షణలో పల్నాడు జిల్లా ఎస్పీ కె .శ్రీనివాస రావు ఐపిఎస్ ఆధ్వర్యంలో వీవీఐపి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు,.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాటు చేసిన బందోబస్తు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యల్లమంద గ్రామ కోదండ రామాలయం ప్రక్కన కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రీఫింగ్ నిర్వహించిన ఐజీ మరియు ఎస్పీ .
🎤 ఈ సందర్భంగా ఐజీ మరియు ఎస్పీ మాట్లాడుతూ…
ప్రజావేదిక పేదల సేవలో సభకు హాజరు అయ్యే ప్రజలకు అనుగుణంగా పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.
వీరిలో 3 అడిషనల్ ఎస్పీ లు, 7 మంది డిఎస్పీ లు, 30 మంది సిఐ లు,99 మంది ఎస్.ఐ లు, మరియు 177 మంది ఏఎస్ఐ/హెచ్ సి లు, 320 మంది పిసి లు, 44 మంది ఉమెన్ పి సి లు,23 మంది ఉమెన్ హోం గార్డ్,281 మంది హోంగార్డులు, ఏ.అర్/ స్పెషల్ ఫోర్స్ సుమారు136 మంది ఉన్నారు. అందరూ కలిపి సుమారు 1120 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది. కావున పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వర్తించాలి.
వీవీఐపిలు మరియు వీఐపీలు సంచరించే హెలిప్యాడ్, పెన్షన్ పంపిణీ లో భాగంగా పెన్షన్ అందుకొనే లబ్దిదారుల ఇళ్ళ వద్ద, కోదండ రామాలయం వద్ద,సభా ప్రాంగణము మరియు కోటప్పకొండ రహదారి వెంబడి బందోబస్తు విధులు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ,ఎటువంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రతలు తీసుకుంటూ,వారి వాహనాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాల గురించి వారికి తెలియపరచాలి.
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే మీ పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన సదరు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు. ఎవరైనా తమ విధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పర్యటన ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలి.
వాహనదారుల తో మరియు ప్రజలతో ఆయా ప్రదేశాలలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో సంయమనం వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలన్నారు.
అనంతరం హెలిప్యాడ్ నుండి సభా వేదిక వద్ద వరకు కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.