నారద వర్తమాన సమాచారం
పోలీస్ శాఖ కార్యకలాపాల నిర్వహణకు నూతన కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం.
ఈరోజు (04.08.2025) పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావు ఐపిఎస్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించబడిన ఆధునిక కాన్ఫరెన్స్ భవనాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఐపీఎస్ ఘనంగా ప్రారంభించారు.
వేద మంత్రోచ్చారణ నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో, ఐజీ కి జిల్లా పోలీసు అధికారులు పోలీస్ గార్డుతో వందనం సమర్పించగా, ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఐజీ కి భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తూ, శ్రద్ధగా వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ…
నూతనంగా నిర్మించబడిన ఈ కాన్ఫరెన్స్ హాల్ పోలీస్ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుందని, ముఖ్యంగా క్రైమ్ రివ్యూలు, శాఖాపరమైన అంతర్గత సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం, ఐజీ జిల్లాకు చెందిన ముఖ్యాధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించి మొదటి క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నూతన హాలులో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
ఈ రోజు పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయం ఆవరణలో కాన్ఫరెన్స్ హాలు నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ కాన్ఫరెన్స్ హాల్ ద్వారా ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కలిగించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ…
ఈ హాల్‌ను ఉపయోగించి బ్యాంకర్లతో సంబంధిత భద్రతా సమీక్ష సమావేశాన్ని ప్రారంభ కార్యక్రమంగా చేపట్టనున్నట్లు తెలిపారు.
అలాగే, స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
కార్యక్రమం అనంతరం భవన నిర్మాణానికి కృషి చేసిన పోలీసు అధికారులకు మరియు కలెక్టర్ కి దుస్సలువాతో సత్కరించి, మెమంటాలను ఐజి అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఐపీఎస్,జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులు,AO దుర్గా ప్రసాద్ సిబ్బంది, పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.