నారద వార్తమన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 77 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
వెల్దుర్తి మండలం శ్రీ రాంపురం తండా గ్రామానికి చెందిన ఆంగోతు హునికి బాయి కుమారునికి భూక్య చిన్న నాయక్ అను అతను ఉద్యోగం ఇప్పిస్తానని 20 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు అడిగితే లారీ తో తొక్కించి చంపుతాను అని బెదిరిస్తున్నందుకు గాను భూక్య చిన్న నాయక్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
గురజాల మండలం పల్లెగుంత గ్రామానికి చెందిన నార్ల ఆదిలక్ష్మి కు ఇద్దరు మగ సంతానం.
ఇద్దరి కుమారులకు వివాహం అనంతరం సుమారు 15 సంవత్సరాల వేరువేరుగా ఉంటున్నట్లు అయితే పోటు రామ్మూర్తి అను అతని వద్ద తన చిన్న కుమారుడు అయిన నార్ల లక్ష్మణరావు అప్పు తీసుకున్నాడని ఆ అప్పును ఫిర్యాది అయిన నార్ల ఆదిలక్ష్మి చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ఇంట్లో సామాను రోడ్డుపై పడవేసి ఇంటికి తాళాలు వేసినట్లు, ఫిర్యాదు కు ఉన్న అర ఎకరం పొలం కౌలుకు ఇవ్వగా కౌలుదారుని తో గొడవ పడి పొలము సాగు చేయనీకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు గాను ఫిర్యాదు తనకు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
నరసరావుపేట రెడ్డి నగర్ కు చెందిన సిరిపల్లి అశోక్ అను అతను టెలిగ్రామ్ ద్వారా వచ్చిన లింక్ లో COINDEX ఇన్వెస్ట్మెంట్ 13 లక్షలు Invest చేసి మోసపోయినట్లు, యూనియన్ బ్యాంకు చెక్కు ద్వారా వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించవలసిందిగా ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట టౌన్ లోని సత్తెనపల్లి రోడ్ లో గల కృష్ణ టవర్స్ నందు ప్లాట్ నెంబర్ 501 యజమాని అయిన షేక్ బషీరూన్ భర్త మహబూబ్ షరీఫ్ అను వారి ప్లాట్ ను సుమారు నాలుగు సంవత్సరముల క్రితం నాగలక్ష్మి ఆమెకు అద్దెకు ఇవ్వగా మూడు సంవత్సరముల నుండి సక్రమంగా చెల్లిస్తూ,సుమారు సంవత్సరం నుండి అద్దె సరిగా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు దానికి గాను ఫిర్యాదు అద్దె కు ఉంటున్న నాగలక్ష్మి ను ఖాళీ చేయమనగా నేను ఖాళీ చేయను, అద్దె ఇవ్వను, నీ మీద కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నందుకుగాను సదరు నాగలక్ష్మి పై చట్టపరమైన చర్యలు తీసుకొన వలసిందిగా ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
బొల్లాపల్లి మండలం మన్నేపల్లి తండా గ్రామం నకు చెందిన రమావత్ ధర్మి బాయి రేమిడిచర్ల లో ఉన్న తన బాబాయి అయిన బాల నాయక్ కు గల రెండు ఎకరాల పంట భూమిలో బాలా నాయక్ కు డబ్బులు అవసరం అయి 80 సెంట్ల పొలమును వినుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు ఫిర్యాది కి అగ్రిమెంట్ చేయగా సదరు పొలంలో పంట పండించుకోవడానికి నీటి సౌకర్యం కల్పించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, అయితే సదరు పొలమును ఫిర్యాది తిరిగి వాళ్ళ బాబాయి ని తీసుకొనవలసింది గా లేకపోతే డబ్బులు కానీ ఇప్పించవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
చిలకలూరిపేట పట్టణం పండరీపురానికి చెందిన పేర్ల హరి గోపాల్ రావు అను ఫిర్యాదు పారా వెంకట లక్ష్మయ్య వద్ద నుండి 4 1/2 సెంట్లు స్థలమును
10,85,000/- కొని మొత్తం డబ్బులు చెల్లించగా పారా వెంకట లక్ష్మయ్య విక్రయ స్వాధీనపు అగ్రిమెంట్ రాసి ఇవ్వగా, రిజిస్ట్రేషన్ చేయించుకొనుటకు చిలకలూరి పేట సబ్ రిజిస్టర్ లో చలానా కట్టి రిజిస్ట్రేషన్ కు రమ్మని పిలవగా కాలయాపన చేస్తూ ఫిర్యాదుకు తెలియకుండా వేరే వారికి మరల రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈ విషయము తెలిసి ఫిర్యాది పారా వెంకట లక్ష్మయ్య ను అడగగా ఇష్టం వచ్చినట్లు తిట్టి మీకు దిక్కున చోట చెప్పుకోండి అని బెదిరించినట్లు అంతట మోసపోయిన ఫిర్యాది
తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం గ్రామానికి చెందిన మిరియాల లక్ష్మి (ఫిర్యాదు) అను ఆమెను ఫిర్యాదు భర్త అయిన మిరియాల వెంకటేశ్వర్లు మరియు ఆమె మనవరాలు గౌతమి వారిని ఫిర్యాది కుమారుడు అయిన మిరియాల నవీన్ కొంతమంది కుర్రవాళ్ల ను తీసుకుని ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తూ చంపుతాను అని ఇబ్బంది పెడుతున్నందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసి, వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.