మావోయిస్టు చలపతి: ఎనిమిదేళ్ల కిందట వరకూ పోలీసులకు ఆయన ఎలా ఉంటారో తెలియదు,తరువాత ఎలా తెలిసిదంటే..చలపతి
ఏపీ పోలీస్
ఛత్తీస్‌గఢ్:- నారద వర్తమాన సమాచారం
ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మరణించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో చలపతి మృతదేహం కూడా ఉందని పోలీసులు ధ్రువీకరించారు.
చలపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఒడిశా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. గెరిల్లా యుద్ధంలో చలపతికి మంచి పట్టు ఉన్నట్టుగా ప్రచారం ఉంది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే(రామకృష్ణ)కు సన్నిహితునిగాను, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ మడావి హిడ్మాకు మెంటార్‌గా ఉన్నారని చలపతికి పేరుంది.
చలపతి చనిపోవడం మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా చెప్పవచ్చని ఏపీకి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.