నారద వర్తమాన సమాచారం
అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ.
మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులు.
.శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఈవో పినాకపాణి.
దాచేపల్లి,
3 నుండి 6 ఏళ్ల చిన్నారులలో విద్యాభివృద్ధి పెంపొందించే కార్యక్రమంలో భాగంగా జ్ఞానజ్యోతి పేరుతో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ భీ పడాయి భీ శిక్షణ కార్యక్రమం మండలం లోని గామాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం ప్రారంభించినట్లు ఐసిడిఎస్ గురజాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం లో విద్యా శాఖ కు చెందిన ఇద్దరు డిఆర్ పి లు చిన్నారుల్లో విద్యను పెంపొందించే అంశాలపై అంగన్వాడీ లకు వివరించారు.మొదటి రోజు శిక్షణ కార్యక్రమానికి దాచేపల్లి ఎంపిడిఓ 2 పినాకపాణి హాజరై అంగన్వాడీ లకు పలు సూచనలు చేశారు.గురజాల ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ లకు రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్ వరలక్ష్మీ తెలిపారు.మొదటి విడత లో 44 మందికి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని, రెండో విడత లో మరి కొంత మందికి దాచేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో మొదటి విడత అనంతరం నిర్వహిస్తుట్లు ఆమె తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్త కు రోజుకు టిఏ అలెవెన్సు క్రింద రూ.50, భోజనం, స్నాక్స్ క్రింద రూ.200, శిక్షణ మెటీరియల్ కోసం రూ.50 లు ప్రభుత్వం కేటాయించినట్లు ఆమె తెలిపారు.మొత్తం రాష్ట్రం లోని 55,607 మంది అంగన్వాడీ ల రెండు విడతల శిక్షణ కోసం మొత్తం రూ.9.45 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది.ఈ శిక్షణ కార్యక్రమం లో నడికుడి, దాచేపల్లి , పులిపాడు సెక్టార్ల కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.