నారద వర్తమాన సమాచారం
కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం!
కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీ యాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ నేతలతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించను న్నారు.
ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిం చడమే కాకుండా, వారిని మరింత చైతన్యవంతం చేయడానికీ అవకాశం ఏర్పడనుంది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కుల గణన చేపట్టడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా , ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించా లనే ప్రభుత్వ నిర్ణయం నేప థ్యంలో, ఈ భేటీ ప్రాధా న్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నదనే సంకేతాన్ని మరింత బలంగా చాటడానికి, ఈ భేటీ ద్వారా నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది.
బీసీ నేతల భాగస్వామ్యం తో రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలను, సంస్కరణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి బిసి నేతలకు కర్తవ్య బోధన చేసేందుకు గాను ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.