నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జె.వి.సంతోష్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 88 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని అడ్మిన్ ఎస్పీ సూచించారు.
అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన గుదేటి శ్యామ్సన్ పని మీద గుంటూరుకు వెళ్లి వచ్చే సమయంలో క్రోసూరు అమరావతి బస్సు వెళ్లిపోవడం వలన తాడికొండ బస్సు ఎక్కి తాడికొండ అడ్డరోడ్ లో దిగినట్లు ఆ సమయంలో అమరావతికి వెళ్లే టాటా మ్యాజిక్ ఆటో ఎక్కి అమరావతిలో దిగగా అతని జేబులో ఉన్న 10,500/-రూపాయలు ఆటో డ్రైవర్ దొంగలించినట్లు కావున తనకు న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
కారంపూడి మండలం రామాపురం తండా కు చెందిన రమావత్ చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి వద్ద కార్ పార్కింగ్ చేసినట్లు, మరుసటి రోజు వచ్చి చూడగా కారు కనబడకుండా పోయినట్లు అంతట ఫిర్యాదు విచారించుకొనగా కారు కొన్న సమయంలో విజయవాడ కు చెందిన అట్లూరి సాయి కృష్ణ షూరిటీ సంతకం పెట్టి తన కారు రెండవ తాళం అతని దగ్గర పెట్టుకున్నట్లు, అతనిని అడగగా కొంచెం పని ఉండి నేను చెప్పకుండా నీ కారు తీసుకుని వెళ్లాను అని చెప్పగా కారు తీసుకుని రమ్మని ఫిర్యాది గత నాలుగు నెలల నుండి అడుగుతున్నప్పటికీని పొంతనలేని సమాధానం చెబుతూ ఇబ్బందికి గురి చేస్తున్నట్లు కావున ఫిర్యాదు తగిన న్యాయం కొరకు అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట పాతూరు కి చెందిన ముక్తవరపు పిచ్చయ్య కు చెందిన మనవడు అయిన ముక్తవరపు గణేష్ మరియు ఫిర్యాదు కోడలు అయిన ముక్తవరపు జయలక్ష్మి అనువారు ఆస్తి వ్రాయమని ప్రతిరోజు గణేష్ మందు తాగి వచ్చి అసభ్య పదజాలంతో తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కావున ఫిర్యాదు తగిన న్యాయం కొరకు అడ్మిన్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
అచ్చంపేట గ్రామానికి చెందిన
వలేరు హనుమ కు విజయవాడ నందు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ నడుపుతున్న నాగరాజు మరియు అతని దగ్గర పని చేసే లతా అనేవారు ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి అక్షరాల 2,50,000/- రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు డబ్బులు అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తునందు గాను తనకు న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
దాచేపల్లి మండలం నడికుడి శివారు మన్సూర్ షా పేట గ్రామానికి చెందిన ఉడతా రమ్య కు హైదరాబాదు దోమలగూడ కు చెందిన విజయ్ కిరణ్ తేజ తో వివాహం జరిపించినట్లు, అయితే తన భర్త అయిన విజయ్ కిరణ్ తేజ కు అనారోగ్యం కారణంగా సంసారం చేయనట్లు, ఆ విషయాలు దాచిపెట్టి ఫిర్యాదు అత్తమామలు డబ్బు కోసం వివాహం చేసి మోసం చేసినందుకు గాను సదరు విషయమై అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట రామిరెడ్డి పేటకు చెందిన ఈ వెంకటేశ్వర రెడ్డి మరియు ఆరుగురు హైదరాబాదుకు చెందిన వీ.నాగేశ్వర్, మేనేజింగ్ డైరెక్టర్ గుంటూరు కు చెందిన రవి ఏజెంట్, ఆన్లైన్ నెట్వర్క్ వ్యాపారం నిర్వహించి సుమారు 60 లక్షల రూపాయలు పెట్టుబడిలో పెట్టించి మోసం చేసినారని, కనుక ప్రజలను మభ్యపెట్టి అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టించి మోసాలకు పాల్పడుతున్న వి.నాగేశ్వర్(హైదరాబాద్) మరియు గుంటూరు కు చెందిన పూల రవి కుమార్ ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
సత్తెనపల్లి పట్టణమునకు చెందిన నందం భూలక్ష్మి అను ఆమె సత్తెనపల్లి కు చెందిన లంకా శ్రీనివాసరావు మరియు అతని భార్య అయిన లంక రాజేశ్వరికి 14,00,000/- రూపాయల డబ్బులు ఇచ్చినట్లు ఇప్పుడు ఆ డబ్బులు ఫిర్యాదు కి అవసరమై లంకా శ్రీనివాసరావు మరియు లంకా రాజేశ్వరి ని అడగగా డబ్బులు అడిగితే చంపుతాము, మేము ఏదైనా చేస్తాం అంటూ బెదిరిస్తూ ఫిర్యాదిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కావున ఫిర్యాదు తగిన న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
దాచేపల్లి కు చెందిన కొప్పుల ఉపేంద్ర మరియు దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన షేక్ హసన్ వలి అను వారికి చేపూరి పూర్ణచంద్రరావు అను అతను పరిచయమై తను నడికుడి SBI బ్రాంచ్ నందు గోల్డ్ అప్రేచర్ గా పని చేస్తున్నట్లు నమ్మ పలికి బ్యాంకులో బంగారం వేలం పాటకు వచ్చిందని తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని ఫిర్యాదుదారులైన ఉపేంద్ర మరియు హసన్ వల్లి వద్ద నాలుగు లక్షల రూపాయలు(ఒక్కొక్కరి వద్ద 2 లక్షల రూపాయలు) తీసుకున్నట్లు బంగారం గురించి అడిగితే వాయిదాలు వేస్తూ రాగా అనుమానం వచ్చి అతని గురించి విచారించగా గతంలో నరసరావు పేట లో చీటీలు వేసి ప్రజలను మోసం చేసినట్లు, నడికుడి SBI బ్యాంకు నందు ఉద్యోగం మానివేసినట్లు తెలిసి మోసం చేసిన పూర్ణచందర్రావు ను చట్టపరంగా చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.