నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఉచిత సిలిండర్లు అర్హులైన లబ్ది దారులకు అందేలా చూడాలి …. జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్,
నియోజిక వర్గ అభివృద్దికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్,
మండలానికి ఒక వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి…..పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయులు
నియోజిక వర్గంలో జరిగే అభివృద్ధి పనులు వివరాలు అధికారులు విధిగా స్థానిక శాశన సభ్యులుకు తెలియచేయాలి….. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు.
సాగు నీటి పారుదలకు అవసరమైన చర్యలు తీసుకోవడం తో పాటు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ లు 36 ఉన్నాయ అందులో 12 మాత్రమే పని చేస్తున్నాయన్న మిగిలినవి పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్. మంగళవారం అమరావతిలో పెదకూరపాడు శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ అధ్యక్షతన నియోజకవర్గం లోని అన్నీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిదిగా పాల్గొన జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ వేసవి కాలంలో వచ్చే నీటి సమస్యలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింతలలో మత్స్యకారుల ఉపాధికోసం చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, మత్స్యకారులకు ఇచ్చే పథకాలు లబ్ధిదారులకు అందించేలా అధికారులు పని చేయాలన్నారు. సూర్యఘర్ పథకానికి లోన్ ఇచ్చేందుకు బ్యాంక్ లు ముందుకు రావాలని, లోన్ లు ఇస్తే సూర్యఘర్ పథకాన్ని పెట్టుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారన్నారు.పేదలకు ఇచ్చే ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల పధకం అర్హులకు అందేలా చూడాలని, జిల్లా కలెక్టర్ ను మంత్రి కోరారు
స్థానిక శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులను ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారని అన్ని గ్రామాల్లో సర్వే చేసి చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. పేదలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని ఈ లక్ష్యం నెరవేరేలా అధికారులు పని చేయాలని కోరారు. పంచాయితీ రాజ్ లో జరుగుతున అభివృద్ధి పనులను నాణ్యతా లోపం లేకుండా చూడాలని కోరారు. పొలాలకు వెళ్ళే డొంక రోడ్డు ల అభివృద్ధి కి అవసరమైన చేయకుంతిసుకోవాలని కోరారు. అమరావతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు సమకూరుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు బోటింగ్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే ముందు రోడ్డు సౌకర్యం చాలా అవసరమని అమరావతికి వచ్చే అన్ని రోడ్లు అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణానికి పెండింగ్ బిల్లులను తెచ్చి పూర్తి చేసేందుకు అధికారులు,కాంట్రాక్టర్ సహకరించడం లేదని రోడ్డు నిర్మాణ పనులు జరగడం లేదు రోడ్డు పూర్తి కావాలంటే అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
పార్లమెంట్ సభ్యులు.లావు శ్రీ కృష్ణదేవరాయులు మాట్లాడుతూ ఎంపీ ల్యాండ్స్ కింద జరిగే పనులను సి ఆర్ డి ఎ పరిధిలో ఉందని చెప్పి నిలిపివేస్తున్నారని, ఎంపి ఫండ్స్ తో జరిగే పనుల పై సమీక్ష చేయాలని కోరారు. మండలానికి రెండు కొత్త హాస్టళ్లు ఏర్పాటు చేసేలా అధికారులు పని చేయాలన్నారు. నియోజిక వర్గ స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం నియోజిక వర్గాలో జరిగే అభివృద్ధి పనులు సత్వర పరిష్కారానికని తెలిపారు.
జిల్లా కలెక్టర్ .పి.అరుణ్ బాబు మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజా పిర్యాదుల సందర్బంగా ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు అధికంగా ఊన్నాయన్నారు. రెవెన్యూలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమములో జాయిట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవిన్యూ అధికారి మురళి, రెవిన్యూ డివిజినల్ అధికారి రామణా కాంత రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.