నారద వర్తమాన సమాచారం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని పణంగా పెట్టి ఎదిగిన వ్యక్తి అని వారి జీవితం ,చరిత్ర స్ఫూర్తిదాయకం… జిల్లా కలెక్టర్ పీ అరుణ్ బాబు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని పణంగా పెట్టి ఎదిగిన వ్యక్తి అని వారి జీవితం ,చరిత్ర స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ శ్రీ పీ అరుణ్ బాబు కొనియాడారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తో కలిసి బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాలన్నారు, భారతీయులందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవనం గడపడానికి ఓకే కారణం రాజ్యాంగమేనన్నారు. డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళ వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సివిల్ వర్కకు సంబంధించి నిధులు అందాయని తెలిపారు. రాబోయే రోజులలో జిల్లా అధికారులు నెలలో ఒకరోజు సంక్షేమ వసతి గృహాలలో పర్యటించి విద్యార్థిని విద్యార్థులతో కలిసిమెలిసి వారి సార్థక బాధ్యతలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి నాలుగో శనివారం ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతున్నదని దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా పలు రాజకీయ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలు స్పందిస్తూ అవసరమైన వాటికి ప్రతిపాదన సిద్దం చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. యు పి ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు శిక్షణను ఏర్పాటు చేసే విధంగానే ఏపీపీఎస్సీ పరీక్షలు హాజరవుతున్న వారికి కూడా ఉచిత శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రత్యేక విద్యార్థిని విద్యార్థులు రాజ్యాంగాన్ని చదివి అందులోని విధులను హక్కులను కావాలన్నారు. శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ విభిన్న కులాలు జాతులు కలిగిన దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అన్నారు. సుమారు భారతదేశంలో 5400 కులాలు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలను తిరిగి అక్కడి సామాజిక ఆర్థిక అంశాలను పరిశీలించి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను నిర్వహించుకోవడం సంతోషిదాయకమని, వ్యక్తిగత అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ వేత్త సంఘసంస్కర్త మరియు జాతీయ ముద్దుబిడ్డ అని ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైన కొనియాడారు. పేద ధనిక తారతమ్యాలను తొలగించిన పుడే దేశం అభివృద్ధి చెందుతుందని భావించారన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది అన్నారు. ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఆయనలో గొప్ప వ్యక్తులు కావాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ప్రజలకు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చే రాజ్యాంగం సృష్టికర్త కావడం గొప్ప విషయం అన్నారు. ఆయన అడుగుజాడలు ఆదర్శనీయమని. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివ నాగేశ్వరరావు , వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలుత పలనాడు బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్థానిక శాసనసభ్యులు అరవింద బాబు తో కలిసి పోలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ర్యాలీలో పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.